Indian opener shikar dhawan 8th century

india versus ireland, india vs ireland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland CWC 2015, Sports, World Cup Live, shikar dhawan, rohit sharma, virat kohli

Indian opener shikar dhawan 8th century, as onother opener rohit sharma out at 64 runs

శివమెత్తిన శిఖార్.. రెండు విక్కెట్లు కోల్పోయిన భారత్

Posted: 03/10/2015 12:23 PM IST
Indian opener shikar dhawan 8th century

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గ్రూపు-బీలో హామిల్టన్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో వంద పరుగుల మైలు రాయిని అధిగమించాడు. వన్డేల్లో శిఖార్ ధావన్ కిది 8వ సెంచరీ. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధావన్ తర్వాత చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ వరల్డ్ కప్ లో రెండో సెంచరీ సాధించాడు.

తాజా శతకంతో పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు. 100 పరుగుల వద్దే 2వ వికెట్ గా ధావన్ అవుటయ్యాడు. అంతకుముందు భారత్ తొలి విక్కెట్ కోల్పోయింది. 27.4 ఓవర్ల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి విక్కెట్ ను కోల్పోయింది. భారత స్కోరు 176 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. ధామ్సన్ బౌలింగ్ లో బీట్ అయ్యిన రోహిత్ విక్కెట్ ను కోల్పోయాడు బంతి బ్యాట్ ఇన్ ఎడ్జ్ కు తగిలి వికెట్ ను పడేసింది. రోహిత్ శర్మ 66 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ల శిఖార్, రోహిత్ లు భారత్ కు 174 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  Ireland  shikar dhawan  rohit sharma  

Other Articles