West indies in trouble in losing 4 wickets in first 10 overs

india versus west indies, indies vs west indies, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, india CWC 2015, Live Scores, Live Updates, west indies, west indies CWC 2015, Sports, World Cup Live

West Indies in trouble in losing 4 wickets in first 10 overs against india in world cup

తొలి 14 ఓవర్లలోనే.. పీకల్లోతు కష్టాల్లో విండీస్..

Posted: 03/06/2015 12:37 PM IST
West indies in trouble in losing 4 wickets in first 10 overs

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగని ధోణి సేన.. వెస్టీండీస్ తో మ్యాచ్ లో బాగా రాణిస్తోంది. భారత బౌలింగ్ సరిగా లేదని విమర్శలు ఎదుర్కోన్న బౌటర్ల దాటికి విండీస్ అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్లు కూడా కుదేలయ్యారు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లను మట్టికరిపించిన తరువాత విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పది ఓవర్లకే విండీస్ పీకల్లోతు కష్టాలలో పడింది. పది ఓవర్లలో 3.8 రన్ రేట్ తో 38 పరుగులు సాధించిన విండీస్.. నాలుగు టాప్ ఆర్డర్ విక్కెట్లను కోల్పోయింది.

విండీస్ అత్యంత విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ 8 వ ఓవర్ లో 21 వ్యక్తిగత పరుగుల వద్ద అవులవ్వడంతో టీమిండియా బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. క్రిస్ గేల్, డ్వేన్ స్మిత్ ఓపెనర్లుగా వచ్చారు. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కొత్త బంతి అందుకున్నాడు. ముందు నుంచి ఆచితూచి ఆడుతున్న విండీస్ ఓపెనర్ డ్వేన్ స్మిత్(6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఐదవ ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్ లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

కాగా క్రిస్ గేల్ కు భారత ఆటగాడు ఉమేష్ యాదవ్ లైఫ్ ఇచ్చాడు. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ ఇచ్చి క్యాచ్ ను ఉమేష్ వదిలేశాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో గేల్ కొట్టిన షాట్ కు బంతి బౌండరీ దాటేట్టు కనబడింది. అయితే పరిగెత్తుకుంటు వచ్చినా ఉమేష్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. బంతిని పట్టుకుని కిందపడిపోయాడు. అతడు కిందపడిన తర్వాత చేతిలోని బంతి జారిపడింది. దీంతో గేల్ బతికి పోయాడు. ఆ తరువాత 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ బౌలింగ్ లో ఇచ్చిన మరో క్యాచ్ ను పట్టుకునేందుకు షమీ విఫలయత్నం చేశాడు. దీంతో గేల్ ను రెండు లైఫ్ లు లభించాయి. ఆ తరువాత షమీ బౌలింగ్ లో షాట్ కోట్టిన గేల్.. మోహిత్ శర్మకు క్యాచిచ్చి వెనుదిరిగాడు.

ఆ తరువాత తొమ్మిద ఓవర్లో నాలుగో విక్కెట్ పడింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో రామ్ దిన్ డౌకౌట్ అయ్యి పెవీలియన్ దారి పట్టాడు.. గేల్ కన్న ముందు వన్ డౌన్ లో వచ్చిన శామ్యూల్స్ కూడా పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో 51 పరుగులు చేసిన విండీస్ ఆచి తూచి ఆడుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  west indies  

Other Articles