Mob finish a rapist in nagaland

nagaland, rape, attck on jail, naga, rapist, jaliyang, homeministry

A mob, consisting of thousands of people, stormed a prison compound in India's far northeast, dragging out a rape suspect before beating him to death on the streets

కామాంధుడికి ప్రజలు వేసిన శిక్ష

Posted: 03/06/2015 12:40 PM IST
Mob finish a rapist in nagaland

ఆడది కనబడితే చాలు కాటువేస్తున్న మానవ మృగాళ్లకు ఓ హెచ్చరిక. కామంతో కళ్లు మూసుకుపోయిన, కామాంధులకు ఇది తగిన శాస్ర్తి. మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని వీధుల్లోకి లాగి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నాగాలాండ్ కు చెందిన ఓ మహిళను ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే ఓ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఎక్కువ సంఖ్యలో జనాలు పోగయ్యారు. కస్టడీకి తరలించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే  నిందితున్ని కఠినంగా శిక్షించాలని సుమారు నాలుగువేల మంది జైలుపై దాడికి చేశారు.  జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్‌ఖాన్‌ను బయటికి తీసుకొచ్చారు. నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ నగరంలోని సిటీ టవర్ వరకూ ఈడ్చుకెళ్లారు, అక్కడే ఉన్న పది వాహనాలకు నిప్పంటించారు. కసితో ఉన్న ప్రజలు నిందితున్ని తీవ్రంగా కొట్టి చంపేశారు. పరిస్థితిని అదుపు చెయ్యడానికి పోలీసులు  కాల్పులు జరిపారు దాంతో ఓ వ్యక్తి మృతి చెందాడు, జనాన్ని చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నాగాలాండ్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మూకుమ్మడిగా కొట్టిచంపడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జిలియాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికైనా చట్టాలున్నాయని, ప్రజలు అలా చట్టాలను చేతిలోకి తీసుకొని వ్యవహరించడం తప్పు అని ఆయన అన్నారు. 'ది ఒక వర్గానికి సంబంధించిన విషయం కాదు. భద్రతా లోపానికి చెందిన విషయం. చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం నేను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తకు ఆదేశిస్తామని అన్నారు.  జైలుపై దాడికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరో వైపు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నాగాల్యాండ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagaland  rape  attck on jail  naga  rapist  jaliyang  homeministry  

Other Articles