Manjhi forms new political party

manjhi forms new political party, manjhi's new political party, former bihar chief minister jitan ram manjhi, manjhi's hindustani awam morcha, former bihar chief minister jitan ram manjhi new political party, manjhis political party name, manjhi's political party, manjhi's new party hindusthani awam morcha, bjp behind manjhi new party

former bihar chief minister jitan ram manjhi forms new political party hindustani awam morcha

ఇంకెన్నాళు .. ఈ అగ్రకుల అధిపత్యం..

Posted: 03/01/2015 11:16 AM IST
Manjhi forms new political party

తానకు ఇన్నాళ్లు ఆశ్రయమిచ్చిన జనతాదళ్ యూనైటెడ్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీ.. తన సొంత కుంపటి పెట్టుకునే యోచనలో వున్నారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (హామ్)  పార్టీని  స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు రాబోయే  ఎన్నికలకు  రంగం సిద్ధం చేసుకుంటూనే ఆయన తన ఒకనాటి మిత్రుడు, ఇప్పుడు శత్రువుగా మారిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జనతాదళ్ యూనైటెడ్ పార్టీలో అగ్రకుల అధిపత్యం నడుస్తుందని ఆరోపించారు. తాను మహాదళిత్ కులానికి చెందిన వాడిని కాబట్టే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకు తోసేశారని ఆరోపించారు. కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తనతో పాటు  బీహార్ లో ఎస్పీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

తాను  రాజీనామా చేసిన తరువాత  ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో  కడిగించారంటూ  మాంఝీ  నితీశ్ పై విరుచుకుపడ్డారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్ నగర్ లోని మాతా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించి వెళ్లిన తరువాత కూడా  దేవస్థానం యాజమాన్యం  దేవస్థానాన్ని  శుభ్రం చేయించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత తన పరిస్థితికి  జేడీయూ లోని  అగ్రకుల నాయకులే  కారణమన్నారు.   తాను దళితుడిని కాబట్టే తనకు అన్యాయం జరిగిందని మాంఝీ వాపోయారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitan ram manjhi  new political party  hindustani awam morcha  

Other Articles