Pawan kalyana meets chandrababu

pawan kalyana meets chandrababu, pawan kalyana meets ap cm, pawan kalyana meets tdp president, cine hero, janasena party president pavan kalyan, andhra pradesh chief minister chandrababu naidu, pavan talks ap farmers issue with cm, pavan talks on centres help to state

cine hero, janasena party president pavan kalyan meets andhra pradesh chief minister chandrababu naidu

చంద్రబాబు పవన్ కళ్యాన్ భేటిపై సర్వత్రా ఆసక్తి

Posted: 03/01/2015 10:13 AM IST
Pawan kalyana meets chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ నటుడు, పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ తరువాత ఇద్దరు నేతల కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకోంది. కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చంద్రబాబుతో చర్చించే అవకాశముంది. కేంద్రం తన మాట నిలబెట్టుకునే సమయం వచ్చిందని ఇటీవల పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్న దరిమిలా పవన్, చంద్రబాబుల భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

దీంతో పాటు ఏపీ రాజధాని వ్యవహారానికి సంబంధించి వివరాలను పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం రాజధాని భూములకు సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో వారి భేటీ ఆసక్తిని రేపుతోంది. రాజధాని భూములు విషయంలో  చంద్రబాబును పవన్ ప్రశ్నించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా బేతంపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి ఆందోథన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతుల భూముల అంశంపై కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశంముందని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chandra babu naidu  ap capital  union budget  

Other Articles