Cbi may quiz jayanthi natarajan on clearance of projects

cbi may quiz jayanthi natarajan, jayanthi natarajan self goal, jayanthi natarajan on clearance of projects, jayanthi natarajan quits congress, CBI, environment minister, Jayanthi Natarajan, Jayanthi tax, Narendra Modi, Politics, Rahul Gandhi, Snoopgate, Tamil Nadu,

cbi may quiz former environmental union minister jayanthi natarajan on clearance of projects

కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ సెల్ఫ్ గోల్..?

Posted: 01/31/2015 07:31 PM IST
Cbi may quiz jayanthi natarajan on clearance of projects

యూపీఏ ప్రభుత్వం హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన జయంతి నటరాజన్ సెల్ప్ గోల్ చేసుకున్నారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతులపై సీబీఐ విచారణ చేపడుతుండటంతో.. తాను సచ్చీలురాలినని జయంతి నటరాజన్ చెప్పుకునేందుకే.. ఇప్పుడామె కాంగ్రెస్ నుంచి వైదొలిగారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా జయంతీ నటరాజన్ ఐదు కంపెనీలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, మైనింగ్ హక్కులకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ ఐదు ప్రాథమిక విచారణలను నమోదు చేసింది.

అయితే ఈ పర్యావరణ అనుమతులు పోందడంలో అమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా ఆమె కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమేయం వుందని రుజువు చేసేందుకే పార్టీ నుంచి బయటకు వచ్చారా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అయితే ప్రాజెక్టుల విషయంలో ఎవరు ఎలాంటి హుకుం చేశారన్నే దానికన్నా.. మంత్రిగా ఎలా అనుమతులు మంజూరు చేశారని.. అనుమతులలో పార్టీ పెద్దల ప్రమేయం విషయం అప్పడే ఎందుకు చెప్పలేదని..? సీబిఐ అడిగే ప్రశ్నలను ముందుగా ఊహించలేకపోయిందా..? అయితే ఇప్పటికే అంత:పాతాళంలో కూరుకుపోయిన పార్టీపై బురదజల్లి జయంతి నటరాజన్ లాబాపేక్ష పొందాలని యత్నిస్తున్నారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.  చూస్తుందా..?

త్వరలో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. బీజేపి వైపుకు వెళ్లేందుకు అమె యత్నిస్తున్నారా..? అంటే కాదనలేని సమాధానాలు వస్తున్నా.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోడీ ప్రస్తావించిన జయంతి టాక్స్ కామెంట్ల నేపథ్యంలో అమెకు బీజేపి స్వాగతం పలుకుతుందా..? లేదా అన్నది కూడా వేచి చూడాల్సిందే. అయితే రాష్ట్రాలలోనూ బీజేపి అధికారాన్ని సొంతం చేసుకునేందుకు కాస్తా ముందుగానే రంగంలోకి దిగుతున్న బీజేపి పార్టీ శ్రేణులు గోప్యంగా జయంతి నటరాజన్ తో పావులు కదిపేందుకు యత్నిస్తున్నారా..? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayanthi natarajan  clearance of projects  CBI  rahul gandhi  

Other Articles