Gali janardhan reddy walk out of jail

Gali Janardhana Raddy, gali janardhan reddy walk free, former minister, obulapuram illegal mining case, Supreme Court, OMC illegal mining case, bail deal case, BJP leader, ballary, kadapa, gali janardhan reddy passport, parappana agrahara jail, bangalore, gali janardhan reddy passport, gali janardhan reddy foreign trips, karnataka former minister gali janardhan reddy,

Gali Janardhana Raddy who was accused in illegal mining case has finally walk out of parappana agrahara jail.

ఎట్టకేలకు స్వేచ్ఛా ‘గాలి’.. జైలు నుంచి విడుదల

Posted: 01/23/2015 06:17 PM IST
Gali janardhan reddy walk out of jail

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డి ఇవాళ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని పరప్పనా అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన ఏడు కేసులలో ఆరు కేసులకు సంబంధించి ఇప్పటికే పలు న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేశాయి. కాగా ప్రధానమైన ఆరోపణలు వున్న ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఈ నెల 20న దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన ఇవాళ బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు.

గాలి జనార్థన్ రెడ్డి విడుదల అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో జైలు ఆవరణకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులు, కొన్ని గంటల నుంచి ఆయన కోసం నిరీక్షించారు. పలువురు కార్యకర్తలు ఆయన పోస్టర్లకు క్షీరాభిషేకం చేశారు. పవిత్రమైన శుక్రవారం రోజున తమ అభిమాన నేత జైలు నుంచి విడుదలవ్వడం శుభసూచకంగా పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు వెంటరాగా, గాలి జనార్థన్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు ర్యాలీగా అభిమానగణంతో  కదలివెళ్లారు.

పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా అగ్రహార జైలు వద్ద 144 సెక్షన్ విధించారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు జైలు అవరణ వద్ద 144 సెక్షన్ అమల్లో వుంటుంది. కాగా 20వ తేదీన బెయిల్ లభించినప్పటికీ సుప్రీం కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్లను పోంది బెంగుళూరు చేరుకున్న అయన తరపు న్యాయవాదులు.. అమావాస్య కారణంగా ఇవాళ జైలు అధికారులకు వాటిని అందించినట్లు సమాచారం. దీంతో గాలి జనార్థన్ రెడ్డి మూడున్నర సంవత్సరాల తరువాత ఎట్టకేలకు స్వేచ్చా’గాలి‘ని పీచ్చుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  supreme court  parappana agrahara jail  bangalore  

Other Articles