Heavy loss to telugu states as oil price goes down

Heavy Loss to telugu states, Heavy Loss to telangana government, Heavy Loss to Andhrapradesh government, Heavy Loss to telugu states since august, Heavy Loss to telugu states on oil prices, Heavy Loss to telugu states on vat, reduced oil prices gives loss to telugu states, low oil prices gives loss to telugu states, telugu states lost vat on oil prices,

Reduction in prices of petrol and diesel since August this year may have brought relief to people, but it has resulted in heavy losses to the Telangana and Andhra Pradesh governments.

ఇంధనధరల తగ్గింపుతో తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం

Posted: 12/26/2014 09:27 PM IST
Heavy loss to telugu states as oil price goes down

ఇంధన ధరలు తగ్గుతూ వాహనదారులకు సంతోషకర వార్తలను అందిస్తుంటే.. ఇదే సమయంలో ప్రభుత్వాలకు మాత్రం నష్టాన్ని అందిస్తున్నాయి. పైకి ఎగబాకడం తప్ప.. కిందకు దగడం తెలియని ఇంధన ధరలు ఒక్కసారిగా ఆగస్టు మాసం నుంచి నేల చూపులు చూడటం.. తెలుగురాష్ట్రాలకు అపార నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఇంధన ధరలు కిందకు దిగిరావడంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే సుమారుగా 500 కోట్ల రూపాయలను కోల్పోగా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలను కోల్పోయింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంధన ధరల పడిపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను కోల్పోతుందని ఆంచనా వేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల ఆధాయాన్ని కోల్పోతున్నట్లు అంచనా. ఇందుకు కారణం ఇంధన దరల పెరగటంతో వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్నును కూడా కోల్పోతున్నాయి. ఆగస్టు మాసంలో ఎనబై రూపాయలు వున్న లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం 67 రూపాయల వద్దకు చేరింది. అటు డీజిల్ కూడా 65 రూపాయల నుంచి 55 రూపాయలకు చేరింది.

అయితే విలువ ఆధారిత పన్నుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కూడా ఇంధన విలువ పడిపోవడంతో తగ్గిపోయింది. వాట్ ద్వారా వచ్చే పన్ను మొత్తం ఆదాయంలో 70 శాతం మేర వుంటుందని, ఇప్పడు ఇందన ధరలు తగ్గడంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అందోళన చెందుతున్నాయి. దీంతో ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తుందని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాగా కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న జీఎస్టీలో పెట్రోల్, డీజిల్, మధ్యానికి మినహాయింపు కల్పించాలని కోరనున్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy Loss  Telugu states  Telangana  AndhraPradesh  oil prices  

Other Articles