High court orders immediate removal of banners cut outs

High Court orders immediate removal of banners, High Court orders immediate removal of cut outs, High Court orders immediate removal of flexi boards, High Court orders removal of banners, High Court orders removal of flexis, High Court orders removal of cut outs, high court reacts on PIL, high cout orders Telangana government, high cout orders andhra pradesh government, high cout orders Telangana police, high cout orders andhra pradesh police

The High Court of Judicature came doen heavily on the banners, cut outs, Flexi boards of politicians and others erected in two telugu states causing inconvenience for the people

హమ్మయ్య..! ఇక రయ్ రయ్ అంటూ వెళ్లవచ్చు..

Posted: 12/26/2014 09:30 PM IST
High court orders immediate removal of banners cut outs


హమ్మయ్య..! ఇక నగరాలు, పట్టణాల్లో వాహానాల స్పీడులకు బ్రేకులు వేశే అనధికార బ్రేకర్లు తొలగిపోనున్నాయి. ఇక ఇక రయ్ రయ్ అంటూ వెళ్లవచ్చు.. అంటున్నారు వాహనదారులు. ఇంతకీ వారి బ్రేకులు ఎలా తొలగిపోయాయో తెలుసా..? హైకోర్టు చలవ వల్ల. అదేంటి వాహనాలకు బ్రేకులను హైకోర్టు తొలగించిందా..? అంటూ నివ్వెరపోకండి.. ఇంతకీ అనధికార స్పీడు బ్రేకర్లు అంటే ఏంటీ..? అన్న సందేహం ఏంటనేగా మీ డౌట్. అనధికార బ్రేకర్లు అంటే సరిగ్గా రోడ్డు కూడలిలో అటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియకుండా, ఇటు నుంచి , ఎడమ వైపు నుంచి, కుడి వైపు నుంచి ఇలా ఎక్కడి నుంచి ఏ వాహనం వస్తుందో తెలియకుండా సగం రోడ్డును అక్రమించి వెలిసిన కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీ బోర్డులే. వాటిని ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది.  ఈ మేరకు ఇరు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలు,  మున్సిపల్ అధికారులను ఆదేశించింది.

బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది ఎంఎస్ఎన్ ప్రసాద్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ..ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అలాగే ఏపీ, తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది.  రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంపై మండిపడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  PIL  Telangana  AndhraPradesh  Flexi boards  Public places  

Other Articles