Sun tv s top executive arrested for alleged sexual harassment

sun TV coo arrest, sun tv coo praveen arrest, Central crime branch police arrested C Praveen, sun tv Chief Operating officer praveen, another sexual harassment in sun Tv, sun tv head booked for sexual harasment, sun tv head arrested under sexual harrasment, police collected evidence on sun tv coo, police got evidence on sun tv coo, police got phone recording of sun tv coo

A team of Central crime branch police officials arrested C Praveen, Chief Operating officer of Sun TV Network, over a sexual harassment allegation from his home.

సన్ టీవీలో మరో లైంగిక వేధింపుల ఘటన.. సీఓఓ అరెస్టు

Posted: 12/26/2014 07:10 PM IST
Sun tv s top executive arrested for alleged sexual harassment

మహిళలపై రోజురోజుకూ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. పురష అహంకార సమాజంలో ఎంతో జాగ్రత్తాగా నెట్టుకుంటూ.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా రాణిస్తున్న మహిళామణులకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఆకాశంలో సగం అంటూ తమకు సమాన హక్కులు కావాలంటున్న మహిళలపై ప్రేమ పేరుతో ఒక చోట, లైంగిక వేధింపులు మరోచోట, వాంఛ తీర్చమని మరో చోట ఇలా ప్రతీ చోట మహిళలు అసహనానికి గురవుతూనే వున్నారు. ఈ క్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న విషమ పరిస్థితిని విశ్లేషించి.. సన్మార్గంలో నడిపేందుకు దోహదపడాల్సిన ఓ అత్యున్నత హోదాలో వున్న వ్యక్తి కూడా చివరకు అదే అకృత్యానికి పాల్పడితే.. ఇక సభ్యసమాజం ఏం చేయాలని..? మహిళా లోకమే ఏకమై వారి భరతం పట్టాలా..? లేక కామాంధుల కళ్లు తమను కవ్విస్తూ చూసే లోపు రాజధాన్ కు చెందిన అక్కాచెలెళ్ల మాదిరిగా తొలు తీసి ఉతికేయాలా..?

మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా వ్యవహరించినందునందుకు సన్ టీవీ ఛానెల్ కు చెందిన ప్రధాన అపరేటింగ్ అధికారి ప్రవీణ్ ను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు నెలల క్రితం వరకు సన్ టెలివిజన్ నెట్ వర్క్ లోని మలయాళం ఛానెల్ లో ప్రోగ్రాం ప్రోడ్యూసర్ గా పనిచేసినప్పుడు తనను సీఓఓ ప్రవీణ్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత రెండేళ్లుగా ప్రవీణ్ తనను వేధింపులకు గురిచేశాడని తన పిర్యాదులో పేర్కొంది. తనతో పాటు ప్రవీణ్ కూడా కేరళకు చెందిన వాడేనని.. మలయాళంలో మాట్లాడుతూ తన పనులను చేసుకుంటున్న తరుణంలో తనను లైంగికంగా వేధించాడని యువతి పిర్యాదులో పేర్కోంది.

ప్రవీణ్ తనను వేధించడాని ధృవీకరించే సాక్షాలను కూడా పోలీసులకు అప్పగించింది. ప్రవీణ్ తనతో మాట్లాడిన సంభాషణల తాలూకు రికార్డులను పోలీసులకు అందించింది. దీంతో ఇవాళ ప్రవీణ్ నివాసానికి వెళ్లిన సెంట్రల్ క్రైం పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రవీణ్ పై లైంగిక వేధింపులకు కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై దర్యప్తును ముమ్మరం చేశారు. సన్ టీవీలో గత ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడి అరెస్టు కావడంలో ఇది రెండవ ఘటన. ఈ కేసుపై స్పందించేందుకు సన్ టీవీ యాజమాన్యం నిరాకరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sun TV Network  Chief Operating officer  sexual harassment  arrest  

Other Articles