Pdp mla fires ak 47 to mark his victory over omar abdullah

PDP MLA fires AK-47, pdp mla Ashraf Mir fires AK-47, Ashraf Mir fires Ak-47 to mark victory, jammu kashmir elections, pdp mla Mohammad Ashraf Mir, sonawar assembly constituency, Ashraf Mir victory over omar abdullah, Ashraf Mir ak 47 firing, Ashraf Mir mark omar abdullah victory,

PDP MLA Mohammad Ashraf Mir, who scored a victory over Omar Abdullah from Sonawar Assembly seat, has stoked a controversy after a video surfaced purportedly showing him firing several rounds from an automatic rifle on the day of Assembly poll results.

ITEMVIDEOS: జమ్మూ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టిన విజయానంధం..

Posted: 12/26/2014 07:07 PM IST
Pdp mla fires ak 47 to mark his victory over omar abdullah

ఎన్నికలలో తన పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో పోటీ అయితే చేశాడు. కానీ గెలుపోటములు దైవాదీనం అనుకున్నాడు. సరిగ్గా ఈ నెల 23న ఎన్నికల ఫలితాల అనంతరం తాను గెలిచానన్న వార్త విని అతనికి అతనే షాక్ కు గురయ్యాడు. అనంతరం కొలుకున్న ఆయన తాను ఓడించిన వ్యక్తి ఎవరనేది తెలుసుకుని మరింత విజయానందం పోందాడు. పీడీపీ పార్టీ తరపున పోటీచేసి సోనావార్ స్థానం నుంచి తాను గెలిచాడు. తన సమీప ప్రత్యర్థి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాను నాలుగు వేల ఓట్లతో ఓడించడంతో మహమ్మద్  అష్రఫ్ మీర్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

పీడీపీ తరఫున పోటీచేసి.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను సోనావార్ స్థానం నుంచి ఓడించిన అష్రఫ్ మీర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తన విజయ సంబరాల్లో ఏకంగా ఏకే 47 తుపాకి తీసుకుని.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన ఇంటి ఎదుట మద్దతుదారులు గుమిగూడి.. మీర్ను అభినందించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమర్ అబ్దుల్లాను 4వేల ఓట్ల తేడాతో ఓడించడంతో కాశ్మీర్లో ఇప్పుడు ఆయనను అంతా జెయింట్ కిల్లర్ అంటున్నారు.

తాను గెలిచి తీరుతానన్న నమ్మకం ముందునుంచి తనకుందని, ఒమర్ అబ్దుల్లా తన శక్తి మేరకు ప్రయత్నిస్తే.. తాను తన శక్తి మేరకు ప్రయత్నించానని గెలిచిన తర్వాత అష్రఫ్ మీర్ చెప్పారు. 15 ఏళ్లుగా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ రాజ్యమేలుతున్నా.. తాము గెలిచి చూపించామని అన్నారు.తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆయన కాల్పులు జరిపిన ఏకే 47 తుపాకి ఆయనదేనా, లేక భద్రతా సిబ్బందిదా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. గెలుపు ఊపులో గాలిలోకి కాల్పులు జరిపి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన అష్రప్ మీర్.. ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాల్పులకు తాను వాడిన తుపాకీ భద్రతా సిబ్బందిదేనన్న వార్తలు వస్తుండడంలో ఆయన ఇబ్బందులను ఎదుర్కోననున్నారు.

ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా.. పీడీపీ నేత మహమ్మద్ అష్రాఫ్ మిర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు సవాలు విసిరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం, వార్తల్లోకి ఎక్కడంతో ఒమర్ ఈ విధంగా స్పందించారు. ఏకే47తో గాల్లోకి కాల్చిన ఘటనపై పోలీసులు దమ్ముంటే మిర్‌పై కేసు నమోదు చేయాలని అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PDP MLA  Jammu and Kashmir  Mohammad Ashraf Mir  

Other Articles