Nasa emails a spanner to space station

NASA emails spanner, NASA emails spanner to Space Station, NASA emails spanner in click, NASA emails spanner in mouse click, NASA, International spsace station, astronauts, Zero-G Technology, scientist Barry Wilmore, 3D printer

When astronauts at the International Space Station (ISS) asked people on Earth to send them a spanner, it took just a click of the mouse to 'email' the hardware to them, literally.

అద్భతం: అంతరిక్ష కేంద్రానికి స్పానర్ను ఈ మెయిల్ చేసిన నాసా

Posted: 12/21/2014 01:36 PM IST
Nasa emails a spanner to space station

అంతరిక్షంలో దూరతీరాలకు మానవులను చేర్చే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. భూమిపై డిజైన్ చేసిన ఒక హార్డ్‌వేర్‌ను తొలిసారిగా రోదసిలోకి ఈమెయిల్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు తమకు ఒక స్పానర్ కావలని అడిగన వెంటనే ఎలాంటి రాకెట్ ప్రయోగం లేకుండా చిన్న కంప్యూటర్ మౌస్ క్లిక్ తో వారికి కావాల్సిన స్పానర్ కు నాసా అందించింది. అక్కడున్న త్రీడీ ప్రింటర్ దాన్ని ముద్రించి వ్యోమగాములకు అందించింది. దీనివల్ల సుదూర అంతరిక్ష యాత్రల్లో బోలెడు వ్యయప్రయాసలు తగ్గాయి.

'మేడ్ ఇన్ స్పేస్' సంస్థ రూపొందించిన త్రీడీ ప్రింటర్ను గత సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తరలించారు. గత నెలలో ఇది తనకు సంబంధించిన ఒక భాగాన్ని ప్రయోగాత్మకంగా ముద్రించింది. తాజాగా 'రాచెటింగ్ సాకెట్ రెంచ్' కావాలని ఐఎస్ఎస్ కమాండర్ బ్యారీ విల్‌మోర్ కోరారు. లోగడ వ్యోమగాములకు ఏదైనా పరికరం కావాలంటే.. భూమి నుంచి తదుపరి రాకెట్ వచ్చే వరకూ నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. బ్యారీ కోరిన స్పానర్‌ను త్రీడీ పరిజ్ఞానంతో ముద్రించాలని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నిర్ణయించింది.

ఇందుకు అనుగుణంగా 'మేడ్ ఇన్ స్పేస్' పరిశోధకులు క్యాడ్ సాయంతో ఈ పరికరాన్ని కంప్యూటర్‌లో డిజైన్ చేశారు. తర్వాత దాన్ని త్రీడీ ప్రింటర్‌కు అనుగుణంగా మార్చి, నాసాకు అందజేశారు. నాసా.. ఈ డిజైన్‌ను ఈమెయిల్ రూపంలో ఐఎస్ఎస్‌కు బట్వాడా చేసింది. దీనికి సంబంధించిన కోడ్ రాగానే.. అంతరిక్ష కేంద్రంలోని త్రీడీ ప్రింటర్ ఆ స్పానర్‌ను ముద్రించింది. ఒక హార్డ్‌వేర్‌ను అంతరిక్షంలోకి ఈమెయిల్ చేయడం ఇదే మొదటిసారి. ''డిజిటల్ డేటా.. కాంతి వేగంతో ప్రయాణించగలదు. అందువల్ల భౌతిక వస్తువులతో పోలిస్తే డేటాను వేగంగా అంతరిక్షంలోకి చేరవేయవచ్చు. ఒక వస్తువును రోదసిలోకి చేరవేయడం కన్నా అక్కడ ముద్రించడమే మేలు'' అని మేడ్ ఇన్ స్పేస్ సహ వ్యవస్థాపకుడు మైక్ చెన్ చెప్పారు.

 త్రీడీ ప్రింటర్‌లో ఎడిటివ్ మానుఫ్యాక్చరింగ్ అనే విధానాన్ని ఉపయోగించుకొని తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్లాస్టిక్ ఫిలమెంట్‌ను వేడి చేస్తుంది. యంత్రంలోకి చొప్పించిన డిజైన్ ఫైల్ ఆధారంగా అవసరమైన వస్తువును పొరలు పొరలుగా ముద్రిస్తుంది. భవిష్యత్‌లో చంద్రుడు, అంగారకుడిపై ఆవాసాలను ఏర్పాటు చేయడానికి కూడా త్రీడీ ముద్రణ పరిజ్ఞానం బాగా అక్కరకొస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. చంద్రుడి, అంగారకుడి ఉపరితలంపై లభించే పదార్థాలను ఉపయోగించి ఆవాసాన్ని ముద్రించాలని భావిస్తున్నారు. దీనివల్ల బోలెడు వ్యయప్రయాసలకోర్చి భూమి నుంచి సరంజామాను తీసుకెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zero-G Technology  NASA  Internation Space station  Barry Wilmore  3D printer  

Other Articles