Surveys predict bjp govt in jharkhand hung assembly in jk

Two states exit polls, jammu kashmir assembly elections, jharkand assembly elections, bjp majority in jharkhand, hung assembly in jammu and kashmir, exit polls survey, assembly election results

Two days ahead of the Jharkhand election results, exit poll surveys, barring one, have predicted absolute majority to the Bharatiya Janata Party (BJP) in the Assembly

మళ్లీ అవే ఫలితాలు పునారావృతం.. కాశ్మీర్లో హంగ్.. జార్ఖండ్ లో కమలం..

Posted: 12/20/2014 09:26 PM IST
Surveys predict bjp govt in jharkhand hung assembly in jk

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ అవే ఫలితాలు పునరావృతం కానున్నాయి. ఒక చోట కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వనుండగా, మరో చోట హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం సీ ఓటర్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో తేలింది. ఐదు దశల్లో జరిగిన జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27-33 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 32-38 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ 4-10 స్థానాలతోను, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 8-14 స్థానాలతోను సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంటే.. ఈసారి అధికార మార్పిడి తథ్యమని తేల్చారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే కనీసం 44 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఈనెల 23వ తేదీ మంగళవారం ఉంటుంది. అదేరోజు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

దశల్లో ఎన్నికలు ముగిసిన జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా, రెండూ కమలానికే పట్టంగట్టాయి. ఏబీపీ నీల్సన్ సంస్థ నిర్వహించిన పోల్స్లో.. బీజేపీ 52, జేఎంఎం 10, కాంగ్రెస్ పార్టీ 9, జేవీఎం 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు.

ఇక ఇండియాటుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో అయితే బీజేపీ 41-49, జేఎంఎం 15-19, కాంగ్రెస్ 7-11, జీవీఎం 0, ఇతరులు 8-12 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. ప్రస్తుతం అక్కడ జేఎంఎం- కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  assembly elections  exit polls  hung assembly  jharkhand elections  bjp win  

Other Articles