Allow german in kendriya vidyalayas this academic session supreme court

German, supreme court, kendriya vidyalayas, sanskrit, union government, orders acadamic year

allow german in kendriya vidyalayas this academic session supreme court

ఈ ఏడాదికి కేవీఎస్ లలో జర్మన్ కోనసాగుతుంది..

Posted: 11/29/2014 12:01 AM IST
Allow german in kendriya vidyalayas this academic session supreme court

కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా ఈ విద్యాసంవత్సారానికి జర్మన్ భాష కొనసాగనుంది. దేశ సర్వోన్నత న్యాయాస్థానం సూచనతో ఈ విద్యా సంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో జర్మనీ భాషను తృతీయ భాషగా కేంద్ర కోనసాగించనుంది. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. జర్మనీ బాషను కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరాలు వున్నా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీఎస్) మూడో భాషగా సంస్కృతాన్ని తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ జారీచేసిన ఆదేశాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం రమారమి పూర్తి కావస్తున్న సమయంలో తృతీయ భాషగా సంస్కృతాన్ని కొనసాగించాలన్న కేంద్రం అదేశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు మూడో ప్రాధాన్య భాషగా జర్మనీని ఈ ఏడాదికి కొనసాగించాలని సూచించింది. కేసు విచారణలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి అటార్నీ జనరల్, గత ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని న్యాయస్థానానికి తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు విద్యార్థులను ఎందుకు బలి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ను ప్రశ్నించింది. జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంపై వివరణ ఇవ్వాలని సూచించింది.

కాగా కేంద్రీయ విద్యాలయాలలో గత కొన్నేళ్లుగా జర్మని భాషను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అందుకుగాను జర్మనికి చెందిన ఒక సంస్థతో ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్మన్ భాషను తొలగించి, సంస్కృతాన్ని పెట్టాలని కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశం ఇచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఆదేశాలతో జర్మన్ భాష అభ్యసించే విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బాధితు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : German  supreme court  kendriya vidyalayas  sanskrit  union government  orders acadamic year  

Other Articles