Chandrababu approves to raise registration charges so as to raise income for andhra pradesh government

handrababu, chief minister, approves, registration charges, raise, raise income, andhra pradesh, AP government, Japan tour

chandrababu approves to raise registration charges so as to raise income for andhra pradesh government

నవ్యాంధ్రలో పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. అయినా అగని విక్రయాలు..

Posted: 11/27/2014 12:01 PM IST
Chandrababu approves to raise registration charges so as to raise income for andhra pradesh government

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని సహా రాష్ట్రవ్యాప్తంగా తాజాగా ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలతో భూముల కోనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్న గుంటూరు, విశాఖ, విజయవాడ జిల్లాల్లోనే ఈ ప్రభావం అధికంగా పడనుంది. రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలపై విధించే స్టాంపు డ్యూటీని పెంచుతూ ప్రభుత్వం తీసున్న నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు సుమారుగా 12 వందల కోట్ల రూపాయల ఆదాయం సమాకూరనుంది.

భూముల క్రయవిక్రయాలపై విధించే స్టాంపు డ్యూటీని  4 నుంచి 5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజును 0.5శాతం నుంచి ఒక శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కుటుంబసభ్యుల నడుమ జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజు పెంచింది. ఇతర ఒప్పందాలపై జరిగే లావాదేవీలకు 6శాతం నుంచి 3శాతానికి సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరగా భూములు కొనుగోలు చేసే వ్యక్తులపై భారం పడనుంది. రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల క్రయవిక్రయాలు పెరిగాయి. సింహభాగం పెట్టుబడులు భూముల కొనుగోలుపై పెడుతుండటంతో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. దీనికి తోడు విజయవాడ, గుంటూరుజిల్లాలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం చేస్తుండటంతో ఇక్కడ భూముల క్రయవిక్రయాలు విపరీతంగా పెరిగాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూములకు మాత్రమే కాకుండా నాగార్జునసాగర్ కాలువల కింద భూములకు సైతం మంచి ధరలు రావడంతో రైతులు భూములు విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. రాజధానిలో భూములను విక్రయించిన రైతులు మరికొంత దూరం వెళ్లి భూములు కొనుగోలు చేస్తుండటంతో క్రయవిక్రయాలు వూపందుకున్నాయి.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపడుతుండటంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం నూతన రాజధానిలో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాజధానిలో సొంతిల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. రాజధాని పరిసర ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పర్చుకోవాలని పలువురు విజయవాడ, గుంటూరు పరిసరాల్లో భూములను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఇంటి స్థలాలను సొంతం చేసుకుంటున్నారు.. దీంతో కృష్ణా, విజయవాడ భూముల క్రయవిక్రయాలు, ఒప్పందాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పటికీ వెరవకుండా.. వెనక్కు తగ్గకుండా రిజిస్ట్రేషన్ జరిపించాలని లేని పక్షంలో భూముల ధరలు మరింత పెరుగుతాయంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపేనా ప్రభుత్వ ఖజానాకు భారీగా అదనపు ఆదాయం సమకూరనుంది.

 పెంపు వివరాలు                                ఇప్పటివరకు        ఇకపై
 స్టాంపు డ్యూటీ                                   4 శాతం          5 శాతం
 రిజిస్ట్రేషన్ ఫీజు                                  0.5 శాతం        1 శాతం
 కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం               1 శాతం          2 శాతం
 ఇతరుల మధ్య ఒప్పందం                       2 శాతం          3 శాతం
 రక్త సబంధీకులకు కానుకలు                    1 శాతం          2 శాతం
 ఇతరుల మధ్య కానుకలు                       4 శాతం          5 శాతం
 భాగస్వామ్య ఒప్పందాలు(కుటుంబసభ్యులు)    0.5 శాతం        1 శాతం
 ఇతరుల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు        1 శాతం          2 శాతం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles