Treat wilful defaulters as freeloaders rbis rajan

Treat, wilful defaulters, freeloaders, Reserve bank of india, RBI Governer, Raghuram Rajan, timely and fair application, current laws, new institutions

Rajan calls for timely and fair application of current laws and new institutions

బ్యాంకుల సోమ్ము తేరగా మేస్తున్న డీఫాల్టర్స్..

Posted: 11/27/2014 02:00 AM IST
Treat wilful defaulters as freeloaders rbis rajan

దేశంలో సామాన్యులు డబ్బులు ఎగవేస్తే వారింటిలోని సమాన్లను తాకట్టు పెట్టుకునే బాంకులు.. పెద్ద పెద్ద ఢీఫాల్టర్ విషయంలో మాత్రం వారిని పెంచి మరీ ఫోషిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌  తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని బడా సంస్థలు, కొందరు బడా వ్యక్తులు బ్యాంకులపై బడి తేరగా మేస్తున్నారని రఘురామ్‌ రాజన్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో రుణాలు తీసుకుని ఎగవేతలకు పాల్పడుతున్న వారి కారణంగా, బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి వారి వల్ల బ్యాంకులకు కలిగే నష్టానికి నిజాయితీగా అప్పులు తీర్చేవారు, పన్ను చెల్లింపుదారులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన ప్రకటించారు. వీరు రిస్క్‌రహిత పెట్టుబడిదారీ విధానాలు అనుసరిస్తూ బ్యాంకింగ్‌ రంగం అందిస్తున్న సదుపాయాలను ఎలాంటి వెరపు లేకుండా స్వేచ్ఛగా అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో వర్గీస్‌ కురియన్‌ స్మారక ఉపన్యాసం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా రుణాలు ఎగవేసే వారిని పరిశ్రమ దిగ్గజాలుగా అభివర్ణించరాదని కూడా ఆయన అన్నారు. అయితే రఘురామ్ రాజన్ రుణ ఎగవేత దారులపై మండిపడటం ఇది తొలిసారి కాదు. అనేక పర్యాయాలు అయన రుణ ఎగవేతదారులపై మండిపడ్డారు.

అలా అని రిస్క్‌ తీసుకోవడానికి తాను వ్యతిరేకం కాదని రాజన్‌ స్పష్టం చేశారు. రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చిన్న ఖాతాదారుల కన్నా పెద్ద ఖాతాదారులే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారని ఆర్‌బిఐ గవర్నర్‌ అన్నారు. ఇలాంటి వారు మంచి సమయాల్లో తమ పెట్టుబడులపై వస్తున్న ఫలాలను ఆస్వాదిస్తూనే సంక్షుభిత సమయాల్లో ఏర్పడే నష్టాలను మాత్రం బ్యాంకింగ్‌ వ్యవస్థకు బదిలీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భారీ కార్పొరేట్ల నిర్లక్ష్య ప్రవర్తన పట్ల ప్రజల్లో అసహనం పెరిగిపోతున్నదని కూడా రాజన్‌ హెచ్చరించారు. బ్యాంకులకు, బడా కార్పొరేట్లకు మధ్య ఏర్పడిన రహస్య అవగాహనే ఎన్‌పిఏలు కొండల్లా పేరుకుపోవడానికి కారణమన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నదని ఆయన చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles