Panic incidents in world cricket history

panic incidents in cricket, ball attacks in cricket, cricketers death, cricket danger, indian cricket latest news updates, australia cricket players, ipl scam, latest news updates

panic incidents in world cricket history : not only philip death there are many panic incidents in cricket world history like lawra, lamba and other players faced this bowling accidents

క్రికెట్ ప్రపంచంలో విషాధ ఘటనలెన్నో

Posted: 11/27/2014 03:01 PM IST
Panic incidents in world cricket history

క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అని అంతా అనుకుంటారు. కానీ ప్రమాదకరమైన ఆట అని కూడా తాజాగా ఫిలిప్ మృతితో స్పష్టం అవతోంది. బంతి బలంతా తలకు తగలటంతో కోమాలోకి వెళ్ళిన ఫిలిప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడన్న విషయం తెలిసిందే. యువ క్రికెటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫిలిప్ మరణం, అన్నిదేశాల ఆటగాళ్లను కలచివేసింది. ఈ మరణం అందరికి ఒక హెచ్చరిక జారీ చేసిందనుకోవచ్చు. ఇక ఇలాంటి విషాద ఘటనలు మన క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయి. చాలా మంది ఆటగాళ్లు డేంజరస్ జెంటిల్మన్ గేమ్ లో గాయాలపాలయ్యారు.. కొందరయితే ప్రాణాలు కూడా కోల్పోయిన దుర్ఘటనలు ఉన్నాయి.

క్రికెట్ చరిత్రలో ఇలాంటి విషాధ ఘటనలు చూస్తే., 1998లో భారత క్రికెటర్ రమణ్ లాంబా బంతి తగిలి చనిపోయాడు. బంగ్లాదేశ్ లో జరిగిన క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో మెహ్రాబ్ హుస్సేన్ బంతిని గట్టిగా కొట్టాడు. అది ఫీల్డింగ్ లో ఉన్న లాంబాకు బలంగా తగిలింది. అక్కడికక్కడే కుప్పకూలిన లాంబా.., ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడ్రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు 1975లో ఓ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పేసర్ లీవర్ వేసిన బంతిని కొట్టబోయి కివీస్ ఆటగాడు ఈవెన్ చాట్ ఫీల్డ్ నాలుక తెంచుకున్నాడు. ఆ తర్వాత చాట్ చాలా ఇబ్బందులు పడ్డాడు.

అటు 1960లో బౌలర్ చార్లీ గ్రాఫిత్ వేసిన బంతి భారత వికెట్ కీపింగ్ బాట్స్ మన్ గా గుర్తింపు పొందిన నారీమన్ కాంట్రాక్టర్ కు బలంగా తగిలింది. కోమాలోకి వెళ్ళి మృత్యువుతో పోరాడి గెలిచినా..., ఆ తర్వాత మాత్రం క్రికెట్ ఆడలేకపోయాడు. 1959లో పాకిస్థాన్ కు చెందిన దేశవాళి క్రికెటర్ అజీజ్ బంతి బలంగా తగిలి చనిపోయాడు. దాల్ద్వార్ అవాన్ అనే బౌలర్ స్లో ఆఫ్ బ్రేక్ బంతి వేయగా అది వచ్చి గుండె భాగంలో బలంగా తగిలింది. ఆ బంతి తప్పించుకున్నా.., తర్వాతి బంతి ఆడేందుకు సిద్ధమవుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి దుర్ఘటనలు క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయి. జరిగిన ప్రమాదాలను ఒక గుణపాఠంగా తీసుకుని ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు అరికట్టవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  philip  death  ball  sports news  

Other Articles