Passengers push frozen siberian plane

passengers push siberian plane, siberian plane break down, siberain plane freeze in ice, siberian plane serviece, siberia filght services, siberia airports, siberia latest news update, flight accidents, funny flight videos, world weird crazy funny facts, latest news updates

passengers push frozen Siberian plane : Due to the low air temperatures, the chassis's brake system froze and a tow truck was unable to move the plane onto the taxiway so The passengers on board got out of the plane and started pushing it onto the taxiway

మంచులో విమానం ట్రబులిచ్చిందని ఏం చేశారంటే...

Posted: 11/27/2014 01:20 AM IST
Passengers push frozen siberian plane

బైక్ లు, కార్లకు స్టార్టింగ్ ట్రబుల్ రావటం గురించి తెలిసిందే. ఇక ఆర్టీసీ బస్సుల గురించయితే చెప్పలేము. ఇలా ఆరంభ కష్టాలు వస్తే ఏం చేస్తారు ఖర్మరా బాబూ అనుకుని స్టార్ట్ అయ్యే వరకు తోసుకుంటూ వెళ్తారు. అదే విమానంకు స్టార్టింగ్ ట్రబుల్ వస్తే.., సాంకేతిక లోపం సమస్య గురించి విన్నాము కానీ స్టార్టింగ్ ట్రుబల్ వచ్చిందని కొత్తగా వింటున్నాం కదా. కానీ సైబిరియాలో ఓ విమానంకు ఈ సమస్య వచ్చింది. ప్రయాణికులంతా వచ్చి కూర్చుని, సీటు బెల్టులు పెట్టుకున్నాక ఫైనల్ అనౌన్ష్ మెంట్ ఇవ్వగానే టేకాఫ్ అవుదామంటే.., అస్సలు కదల్లేదు.

విషయం తెలిసిన ప్రయాణికులు.., తప్పదు రా బాబూ అనుకుంటూ విమానంను తోయటం మొదలు పెట్టారట. విమానం రెక్కలు పట్టుకుని అంతా కలిసి నెట్టడం మొదలు పెట్టారు. అలా నెట్టుకుంటూ ట్యాక్సీ వే కు తీసుకొచ్చారు. అక్కడ విమానం సమస్యను సరిదిద్ది తిరిగి ప్రయాణం ప్రారంభించారట. ఇంతకీ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదూ. ఆర్కిటిక్ ఖండంలోని దేశమైన సైబిరియాలో చలికాలం వాతావరణం భయానకంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ కు పడిపోయి ఎక్కడ చూసినా మంచు తప్ప ఇంకేమి కన్పించదు. ఈ ఘటన జరిగినప్పుడు స్థానికంగా మైనస్ యాబై రెండు డిగ్రీలుగా ఉష్ణోగ్రత ఉందట. మనకు ఇరవై, పది ఉంటేనే వణికిపోతాము. అక్కడ మైనస్ యాబై అంటే ఎంత దారుణంగా ఉటుందో ఊహించవచ్చు.

అలాంటి ఉష్ణోగ్రతల మద్య వాతావరణ మార్పుల కారణంగా విమానం ఇంజన్ ప్రారంభమయ్యేందుకు మొరాయించిందట. రన్ వేను మంచు పూర్తిగా కప్పేయటంతో విమానం దగ్గరకు వచ్చి రిపేర్ చేసేందుకు చాన్స్ లేదు. దీంతో ప్రయాణికులే విమానంను టాక్సీ వే వరకు నెట్టుకుంటూ తీసుకెళ్ళారు. నరాల్లోని రక్తం గడ్డకట్టే చలి మద్య చేసిన ఈ ఫీట్ ను ఓ ప్రయాణికుడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. వారి మంచు కష్టాలు మీరూ చూడండి.

{youtube}k0kSMnG6Lik|620|400|1{youtube}


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : passengers  siberian flight  push  ice  

Other Articles