Terrorist training given to indian ladies reveals burdwan bomb blast case main accused fathima begum

burdwan bomb blast case, fathima begum, west bengal, bangladesh, dhaka, terrorist training, ladies, main accused

terrorist training given to indian ladies reveals burdwan bomb blast case main accused fathima begum

తస్మాత్ జాగ్రత్త.! ఉగ్రవాదులలో మహిళలూ వున్నారట..

Posted: 11/27/2014 01:00 AM IST
Terrorist training given to indian ladies reveals burdwan bomb blast case main accused fathima begum

పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్ బాంబు పేలుడు కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఫాతిమాబేగం(35) వెలువరించిన కఠోర విషయాలు భారతీయులను తీవ్ర మనోవేధనకు గురిచేస్తున్నాయి. బర్ద్వాన్ బాంబు పేలుడు తరువాత బంగ్లాదేశ్‌ కు పారిపోయిన ఫాతిమా బేగంను ఢాకాలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ పోలీసులకు అమె వెలువరించి అంశాలు, ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి అక్కడి పోలీసులు నివ్వెరపోయారు. భారత్‌లోని 25 మంది మహిళలకు పాక్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించామని పేర్కొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. మహిళా ఉగ్రవాదుల కోసం అన్వేషణ ప్రారంభించారు.

బంగ్లాదేశ్ లోని ఢాకాలో వున్న ఫాతిమా బేగంను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఏఐ) అధికారులు ఒకటి రెండు రోజుల్లో భారత్‌కు తీసుకురానున్నారు. బర్ధ్వాన్ కేసులో వారం క్రితం హైదరాబాద్‌లోని బార్కస్ రాయల్‌ కాలనీకి చెందిన బర్మా దేశ శరణార్ధి ఖలీద్ (28) ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే ఫాతిమాను అరెస్టు చేశారు. ఆమె వెల్లడించిన అంశాలపై నిఘా సంస్థలు  దృష్టి సారించాయి. ఈ విషయంపై రాష్ట్రాలను కేంద్ర ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసింది. బర్మా నుంచి శరణార్ధులుగా వచ్చి రాయల్ కాలనీలో స్థిరపడిన మహిళల గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల ఓ మెడికో ఇరాక్‌లో ఉగ్రశిక్షణకు వెళ్లేందుకు సిద్ధపడిన విషయం తెలియడంతో పోలీసులు యువతిని ఆమె కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసి పంపించారు.

ఇదే తరహాలో ఎవరైనా వెళ్లారా?, శిక్షణ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చారా? అనే విషయాలపై నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి పాల్పడినవారు, పేలుడు కేసులో నిందితులు ఒక్కరేనని తేలింది. దీంతో బర్ధ్వాన్ కేసులో పట్టుబడిన హఫీజ్‌మొల్లా, షేక్‌అహ్మద్, హసన్‌సాహెబ్, రజియా బీబీ, అలీ మా బీబీలకు బ్యాంక్ దోపిడీలో పాత్రపై ఆరా తీస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles