Dwcra ladies fight severely in khammam

dwcra groups, ladies fighting, municipal office, municipal commissioner, police, 300 ladies

dwcra ladies fight severely in khammam

కుమ్ములాడుకోలేమా..? మేమేం తక్కువ తిన్నామా..?

Posted: 11/27/2014 12:00 AM IST
Dwcra ladies fight severely in khammam

300 మంది పలు ముఠాలుగా విడిపోయిన తీవ్రంగా కోట్టకోవడంతో కంగారు పడిన మున్సిపల్ కమీషనర్.. పోలీసులకు ఫోన్ చేశారు. తక్షణం రావాలని కోరారు. అంతేకాదు ఆయన మున్సిఫల్ కార్యాలయంలోకి వెళ్లి, ఎవ్వరూ తన వద్దకు రాకుండా అటెండర్ ను పురమాయించారు. 300 మంది కోట్టుకోవడమంటే ఏదో పెద్ద గొడవే జరుగుతుందని ఊహించిన పోలీసులకు.. వారి వద్ద మారణాయుధాలు ఏమైనా వున్నాయా, కర్రలు, రాడ్లు లాంటివేమైనా వున్నాయా అని అరా తీశారు. అంతే అప్పుటి వరకు పోలీసులందరిని సిద్దంగా వుండాలని ఆదేశించిన ఉన్నతాధికారులు.. ఇక మహాళా పోలీసులను సిద్దం కమ్మని చెప్పా.. కొందరు మగ పోలీసులతో కలసి గొడవ జరుగుతున్న మున్సిఫల్ కార్యాలయానికి వెళ్లారు.
 
అక్కడకు చేరుకోగానే మున్సిఫల్ కమీషనర్ అందించిన సమాచారం కరెక్టే ననుకుని.. అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో పోలీసులు తమ వారిని అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో అక్కడికి వచ్చిన వారితో మీ భార్యేనా..? ఎందుకు అంతలా కోట్టింది. గమ్మునుండమంటే కూడా ఉండటం లేదు. అవతలి వాళ్లు మనుషులు కాదనుకుంటోందా అంటూ పోలీసులు ప్రశ్నించారు. ఇప్పుడు మీకు కూడా విషయమం అర్థమైందనుకుంటా.. కోట్టుకోవడం చేసింది పురుష పుంగములు కాదు. వారి  ఆకాశంలో సగం అంటే సరిపోతుందా.? మీకులా మేమూ తన్నుకోలేమా, గోడవ పడలేమా..? ఠాణాలకు వెళ్లలేమా..? అన్నట్లు సాగిన ఈ ఘర్షణలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

డ్వాక్రా మహిళల మధ్య చిచ్చు రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. మామూలుగా కాదు, జుట్టు జుట్టు పట్టుకుని వీరంగం సృష్టించారు. డ్వాక్రా సంఘాలకు చెందిన మొత్తం 1.80 లక్షల రూపాయల సొమ్మును కొంతమంది స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో 80 వేలను తిరిగి కట్టేశారు. మరో లక్ష రూపాయలు ఇంకా అలాగే ఉంది. డబ్బులు పక్కదోవ పడుతున్నాయంటూ కొంతమంది కలిసి ఓ గ్రూపు నాయకురాలిపై ఆరోపణలు చేశారు. దీనిపై కార్యవర్గ సభ్యులకు తెలియకుండానే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతా కలిసి సమావేశం ఏర్పాటుచేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.

దాంతో 28 డ్వాక్రా సంఘాలకు చెందిన దాదాపు 300 మంది మహిళలు ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అది కాస్తా.. ఘర్షణకు దారితీసింది. మునిసిపల్ కమిషనర్ చూస్తుండగానే ఆయన సాక్షిగా కొట్టుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. విపరీతంగా జుట్లు పట్టుకుని, పిడిగుద్దులు కురిపిస్తూ కుమ్ములాడుకున్నారు. దీంతో కమిషనర్ తన కార్యాలయంలోకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వన్ టౌన్ పోలీసులు వచ్చి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : dwcra groups  ladies fighting  municipal office  municipal commissioner  police  300 ladies  

Other Articles