Naralokesh on tdp future activities and party membership registration

nara lokesh latest comments, nara lokesh comments on trs, nara lokesh on telangana, nara lokesh in tdp, tdp government, tdp latest updates, telangana latest news, andhrapradesh news, party list in india, largest political partiies in the world

naralokesh on tdp future activities and party membership registration : tdp leader and party chief son nara lokesh says if 25lakhs people joined in tdp party will become second largest party in the world. do hard work and go to remote areas for party membership registration says nara lokesh

ప్రపంచంలో రెండవ అతిపెద్ద పార్టీగా టీడీపీ - నారా లోకేష్

Posted: 10/31/2014 07:50 AM IST
Naralokesh on tdp future activities and party membership registration

తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటిన వ్యక్తుల్లో నందమూరి తారకరామారావు చెప్పుకోదగ్గ వ్యక్తి. తెలుగువారి సంక్షేమం కోసం ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ... ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది, తెలంగాణలో ప్రతిపక్షంగా కొనసాగుతోంది. అటు పార్టీకి అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ప్రజా ప్రతినిధి ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. కానీ తెలుగువారికి పార్టీపై ఉన్న మక్కువ, విశ్వాసం కారణంగా ఈ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు క్రమంగా పార్టీ దేశంలోనే కాదు.., ప్రపంచంలోనే పెద్ద పార్టీగా అవతరించేందుకు సిద్ధం అవుతోంది.

నవంబర్ లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి సంబంధించి కార్యకర్తలతో నారా లోకేష్ మాట్లాడారు. గ్రామాల్లో, క్షేత్రస్థాయిల్లోకి వెళ్లి సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో నవంబర్ లో సభ్యత్వ సమోదు జరిగితే.., కేరళ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్బంగా 25లక్షల మంది పార్టీలో చేరితే తెలుగుదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. ఇందుకోసం అంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ సభ్యత్వ రుసుము రూ.10 అని.., క్రియాశీలక కార్యకర్తల రుసుము రూ.100 గా నిర్ణయించామన్నారు. ఈ సభ్యత్వ నమోదును ప్రతి టీడీపీ కార్యకర్త విజయవంతంగా పూర్తి చేసి పార్టీ పటష్టత, బలం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారందరికి టీడీపీ సంక్షేమ ఫలాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఇలా పార్టికి సంబంధించి లోకేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే మరొ రెండు రాష్ర్టాల్లో సీట్లు రావాల్సి ఉంది. అంటే ప్రస్తుతం జాతీయ పార్టీ కూడా కాదు అన్నమాట.., అలాంటిది మరి ప్రపంచంలో పెద్ద పార్టీ కావాలని ప్రకటించటం ఏమిటో.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  tdp  telangana  andhrapradesh  

Other Articles