Bjp government likely be formed with the outside support of ncp

Maharastra, BJP, NCP, Shiv sena, Devendra Fadnavis, hiv sena, uddav thackery, rajiv pratap rudi, wankhede stadium, arrangements, NCP, sharad pawar

bjp government likely be formed with the outside support of ncp

తెగిన పాతికేళ్ల మైత్రిబంధం.. చిగురించిన కొత్త స్నేహం..

Posted: 10/30/2014 10:34 PM IST
Bjp government likely be formed with the outside support of ncp

మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు చోటుచేసుకున్నట్టుగానే రాజకీయ పరిణామాలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కూడా చోటుచేసుకుంటున్నాయి. పాతికేళ్ల పాత మైత్రి బంధాన్ని కాదని.. కొత్త పార్టీ అందించిన స్నేహ హస్తంతో బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తానికి శివసేనకు బీజేపీ మరోమారు షాక్ ఇచ్చింది. శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ప్రభుత్వ ఏర్పాటుకు పెట్టిన కండీషన్లకు స్వప్తి పలికిన బీజేపి అడగకుండానే మద్దతు తెలిపిన ఎన్సీపీని అక్కున చేర్చుకోనుంది. మహారాఫ్ట్ర ప్రజల దీర్ఘకాల ప్రయోజనాల కోసం తాము బయటి నుంచి మద్దతు ఇస్తామని ఇప్పటికే ఎన్సీపి స్పష్టం చేసింది. దీంతో ఎన్సీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే చిరకాల మిత్రపక్షమైన శివసేనతో పొత్తు అంశం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని.. రేపు శివసేనకు సంబంధించిన వారెవ్వరూ ప్రమాణ స్వీకారం  చేయబోరని బీజేపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు.

ప్రమాణస్వీకారంలో తమకూ భాగం కల్పించాలని శివసేన బీజేపీని కోరింది. అయితే బీజేపీ తమకు అవకాశం కల్పించకపోతే ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధమేనంటూ సంకేతాలు ఇస్తోంది. దీంతో ఎన్సీపి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో బీజేపి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆపార్టీ అధినేత శరద్ పవార్ బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే  దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారోత్సవానికి ఎన్సీపి ఎమ్మెల్యేలు గౌర్హాజరు అవుతారని తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరుకారని చెబుతున్నారు.
 
మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి వాంకాడే స్టేడియంలో సినిమా సెట్లను తలపించేలా వేదిక నిర్మాణం జరుగుతోంది. శుక్రవారం జరగనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ సీకారోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ మొదటిసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ముంబాయిలోని వాంకాడే స్టేడియంలో నిర్వహించే వేడుకకు సుమారు 40 వేల మంది హాజరు అవుతారని అంచనా. దేవేంద్ర ఫడ్నవీస్‌ మంత్రివర్గంలో చోటు కోసం బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
దీంతో ఎన్సీపి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో బీజేపి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆపార్టీ అధినేత శరద్ పవార్ బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే  దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారోత్సవానికి ఎన్సీపి ఎమ్మెల్యేలు గౌర్హాజరు అవుతారని తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరుకారని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే తమకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు  ఉందని బీజేపి చెబుతోంది. అయినప్పటికీ ఇంకా మరో పది మంది మద్దతు కావాలి. గవర్నర్ చెప్పిన ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన తరువాత 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది.  అప్పటికి ఆ పది మందిని సమకూర్చుకోగలమన్న ధీమాతో బీజేపి ఉంది. శివసేనతో చర్చలు ఫలించకపోతే బీజేపికి ఎన్సీపి మద్దతు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles