What congress party future plan to grow

congress party programmes, congress party latest, bjp party latest, 2014 elections partywise mp seats, 2014 elections congress seats in all states, telangana congress, andhrapradesh congress, telugu latest news, nda government ruilng programmes, upa government mistakes scams

what congress party future plan to grow : congress party got heavy loss in latest general electi0ns it came from ruling party to even not owned a lop in parliament. all are discussing on why congress party having losses and how party will get on future

నడిసంద్రంలో నిలిచిన నావ... కాంగ్రెస్ పయనమెటో?

Posted: 10/31/2014 09:03 AM IST
What congress party future plan to grow

బండ్లు ఓడలవుతాయి... ఓడలు బండ్లవుతాయి అనే మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టికి సరిగ్గా సూట్ అవుతుంది. పది సంవత్సరాలు అధికారం అనుభవించిన పార్టీ.., ప్రస్తుతం కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేదు. అటు తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా హర్యానాలో అధికారం కోల్పోగా.. మహారాష్ర్టలో ఒరిగిందేమి లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మోడీ హవా తగ్గిపోయింది అని అంతా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం తగ్గటం లేదు. ఇది అందరూ చెప్తున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో 128ఏళ్ళక్రితం ప్రస్థానం మొదలు పెట్టిన ఈ పార్టీ ప్రయాణం నడిసంద్రంలో నావలా మారింది. మరిప్పుడు ఎటు వెళ్తుంది...? ఏం చేస్తుంది?

స్వాతంత్ర్యానికి పూర్వం పుట్టిన కాంగ్రెస్ పార్టికి ఎంతో చరిత్ర ఉంది. దేశాన్ని, ప్రపంచాన్ని శాసించిన ఎంతోమంది నేతలు ఈ బడిలో ఓనమాలు నేర్చుకున్నవారే. భారత దేశానికి రాజకీయాలు నేర్పింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పొలిటికల్ దిగ్గజం ఇప్పుటు కర్రపట్టుకుని కూడా నడవలేకపోతోంది. కొండ నాలుకకు మందువేస్తే మందు నాలుకకు ముప్పు వచ్చినట్లు.. పార్టీ నాయకత్వంలో మార్పు కొత్త జవసత్వాలు ఇస్తుందనుకుంటే ఉన్న బలం కాస్తా తగ్గిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా అనేక అంశాలు కాంగ్రెస్ ను ఓడించటంలో ప్రభావం చూపాయి.


అందులో ప్రధానంగా మోడి మ్యానియా ఒక కారణం అయితే.. కాంగ్రెస్ సొంత తప్పిదాలు ఎక్కువగా ప్రభావం చూపాయి. అధికారంలో ఉండగా ఎన్నో స్కాములు జరిగాయి. గత ఐదేళ్ళలో ప్రతి పార్లమెంటు సమావేశం ఏదో ఒక స్కాముపై ఆందోళనతో అట్టుడికింది. దీంతో యూపీఏ అంటే స్కాముల ప్రభుత్వం అని ముద్రపడింది. దీనికి తోడు పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఇలా అనేక అంశాలు ప్రభుత్వాన్ని మసకబార్చాయి. ఇలా అన్ని కలిసి కాంగ్రెస్ నావను తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేశాయి. దీంతో కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని భావించే వారు ప్రత్యామ్నయంగా ఉన్న బీజేపికి వేస్తున్నారు అన్నమాట. అలా కమలం వికసించటానికి కాంగ్రెస్ తన చేతులతో నీరు పోస్తోందని స్పష్టం అవుతోంది.

ఓటమి గెలుపుకు దారి చూపుతుంది అంటారు... అంతేకాక ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి. కాబట్టి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి వారితో కలిసి, వారి మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తే పునర్వైభవం ఖాయం. అంతేకాని పార్టీ వార్ రూంలో కూర్చుని ఫలితాలపై పోస్టుమార్టం చేసి రాజకీయ విశ్లేషణలతో సమయం వృధా తప్ప మరొకటి ఉండదు.  రాహుల్ సమీక్షలు, దిగ్విజయ్ పర్యటనలు ఫలితాలను మార్చలేవు, ప్రభుత్వంలోకి రానీయలేవు అని విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తి పూజ మానుకుని..., ప్రజలను పూజించి వారి సమస్యలపై పోరాటం చేస్తే పోయిన పేరు తిరిగి వస్తుంది. ప్రజలను నమ్ముకుని పనిచేసిన వారిని జనాలెప్పుడూ మోసం చేయరు. ఎందుకంటే వారు రాజకీయ నేతలు కాదు కాబట్టి. ఇది తెలుసుకుని నడుచుకుంటే మహర్ధశ పట్టవచ్చు లేకపోతే పార్టీని మర్చిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress party  bjp  politics  latest updates  

Other Articles