Neighbour rapes five and a half year old girl arrested

crimes against women, rape, Utai Police, Durg, Chhattisgarh

Neighbour rapes five and a half year old girl, arrested

ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ‘మగ’మృగం

Posted: 10/24/2014 12:33 PM IST
Neighbour rapes five and a half year old girl arrested

బెంగళూరులో నర్సరీ బాలికపై అత్యచారం జరిగిన ఘటనను మరవక ముందే.. దేశంలో మరో ఘటన సంభవించింది. ఐదున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఛత్తీస్ గడ్ లోని దుర్గ్ ప్రాంతంలో గల మాచందూర్ గ్రామాంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి వెలుపల ఆడుకుంటున్న ఓ ఐదున్నరేళ్ల బాలిపై పక్కింట్లో నివాసముండే.. కేశవ్ అలియస్ పింటూ అనే పందోమ్మిదేళ్ల మధమృగం అత్యాచారం చేశాడు.

అభం శుభం తెలియని అమాయకురాలైన అమ్మాయికి చాక్లెట్ల ఆశ చూయించి.. గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన యువకుడు.. అ చిన్నారిపై అత్యచారానికి తెగబడ్డాడు. అత్యాచారం  చేసిన తరువాత నొప్పి భరించలేక ఏడుస్తున్న బాలికను తన వద్దే బందీగా పెట్టుకున్నాడు. చిన్నారి కనబడకపోవడంతో.. అమె తల్లిదండ్రలు వెతకడం ప్రారంభించారు. ఆరుబయల ఆడుకుంటున్నఅమ్మాయిని ఎవరు అపహరించారంటూ శోకసంధ్రంలో మునిగారు. కాలతీతమైంది. సాయంత్రం.. చీకట్లు కమ్మకుంటున్న వేళ ఐదున్నరేళ్ల చిన్నారి ఇంటికి చేరింది. తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఉటాయ్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. నిందితుడు కేశవ్ అలియాస్ పింటూను పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచరం కింద 376, బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడిన చట్టం (2012) కింద సెక్షన్ 5, 6 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై ఛత్తీస్ గడ్ రాష్ట్ర బాలికల కమీషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. మరోమారు ఎవ్వరూ ఇలాంటి అతిదారుణ, దుర్మాగ ఘటనలకు పాల్పడకుండా.. కఠినంగా శిక్షించాలని ఆ సంఘం అధ్యక్షురాలు డిమాండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crimes against women  rape  Utai Police  Durg  Chhattisgarh  

Other Articles