Another rave party busted in hyderabad youth arrested it s a get together says police

private companies, economic reforms, slow track, PM narendra modi, India, Private Firms

another rave party busted in hyderabad youth arrested, it's a get together says police

అది రేవ్ పార్టీ కాదట.. గెట్ టు గెదర్ అట..

Posted: 10/24/2014 11:14 AM IST
Another rave party busted in hyderabad youth arrested it s a get together says police

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. దేశీయులకే కాదు వీదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు వేయించి రేప్ పార్టీలు జరుపుకుంటున్నారు. ఇదే తరహాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న మరో యువకుల బృందంపై పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ విచిత్రమేమంటే ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా వున్నది నైజీరియన్లే. 12 మందిలో ఏడుగురు నైజీరీయన్లు వుండగా, మరో 5 మాాత్రం మనవాళ్లు. అందులో రిసార్ట్ మేనేజనర్ ఒకరు. తమ రేవ్ పార్టీపై దాడి చేశారన్న అగ్రహంతో పోలీసులపైనే తిరగబడ్డారు. తామేం. మేం ఏం తప్పు చేశామో చెప్పండంటూ నిలదీశారు. ఈ సమయాన్ని అసరాగా చేసుకుని మరికొంతమంది యువతీ యువకులు రిసార్ట్స్ నుంచి పరారీ అయినట్లు సమాచారం.

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనిబర్గ్‌ రిసార్ట్స్లో యువతులను వివస్త్రలుగా చేసి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఇవాళ తెల్లవారుజామున దాడులు చేశారు.  రిసార్ట్స్ మేనేజర్తో పాటు పన్నెండు మంది యువకులు ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. తిరగబడ్డనా వదలని పోలీసులు వారని స్టేషన్ కు తరలించారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ వుంది. ఇంత జరిగినా.. మన పోలీసులు మాత్రం రిసార్ట్ లో రేవ్ పార్టీ జరగలేదని అంటున్నారు. అంతేకాదు అక్కడ కేవలం గెట్ టుగెదర్ మాత్రమే జరిగిందని నమ్మబలుకుతున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని వారు పేర్కొన్నారు. భారీ స్థాయిలో డబ్బులు ముట్టడంతోనే పోలీసులు ఈ మేరకు కథ మొత్తాన్ని మార్చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు రాజకీయ జోక్యం కూడా కారణమని తెలుస్తోంది. ఒక వేళ రిసార్ట్ లో జరిగింది కేవలం గెట్ టుగెదర్ అయితే.. నైజీరన్ల సహా 12 మందిని పోలీసులు ఎందుకు పోలిస్ స్టేషన్ కు తరలించారన్నది శేష ప్రశ్నగానే మిగులుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : private companies  economic reforms  slow track  PM narendra modi  India  Private Firms  

Other Articles