Sabarimala to be declared national pilgrimage centre

Sabarimala, Narendra Modi, BJP, Kerala, Prime Minister, national Pilgrimage, national hertage, Aranmula, chief minister, oommen chandy, demand

Sabarimala to be declared national pilgrimage centre and Aranmula as national Heritage

జాతీయ పుణ్యక్షేత్రంగా శబరిమల..? కేంద్రం యోచన..

Posted: 10/24/2014 01:22 PM IST
Sabarimala to be declared national pilgrimage centre

పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలను జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రకటించాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు అందుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ డిమాండ్ తెరపై వుండటంతో శబరిమలను జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రకటించి.. కేరళలోనూ తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా బీజేపి పావులు కదుపుతోంది. స్వతహాగా కాంగ్రెస్ అధికారంలో వున్న రాష్ట్రాలపైన దృష్టి సారించిన ప్రధాని మోడీ.. క్రమంగా వాటిని తమ కోటలుగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళలోనూ తాము అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న బీజేపి కేరళ వాసుల ప్రధాన డిమాండ్లను అంగీకరించి.. పట్టు సాధించాలన యోచిస్తున్నారు.

ఈ ధఫా మండల పూజ కార్యక్రమంలోపూ ప్రవిత్ర పుణ్యక్షత్రం శబరిమలకు ప్రధాని మోడీ రానున్నారని సమాచారం. ప్రధానమంత్రి ఇక్కడకు వస్తారన్న వార్తలకు బలం చేకూరుతోంది. మండల దీక్ష నేపథ్యంలో రద్దీ అధికంగా వుంటుంది కాబట్టి, రద్దీ ప్రారంభానికి ముందే ఆయన శబరిమలకు వచ్చి వెళ్తారని సమాచారం. అంతేకాకుండా రద్దీ ప్రారంభమైతే.. ప్రధాని భద్రతకు కూడా కష్టమని ముందుగానే ప్రధానిని శబరిమల యాత్రకు బీజేపి వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శబరిమలలో అయప్పస్వామిని దర్శించుకున్న తరువాత.. కేరళవాసుల దీర్ఘకాలిక డిమాండ్ను పరిగణలోకి తీసుకుని ఆయన శబరిమలను జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రకటించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంధీ కూడా గత వారం కిందల ఢిల్లీకి వెళ్లిన సందర్బంగా శబరిమలను జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శబరిమలను జాతీయ పుణ్యక్షేత్రంగా మార్చాలని తమ పార్టీని బలపర్చుకోవాలని బీజేపి జాతీయ, రాష్ట్రీయ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో పాటు ప్రధాని మోడీతో అరన్ముల ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపద గ్రామంగా ప్రకటింపజేయాలని బీజేపి వర్గాలు యత్నిస్తున్నాయి. దీంతో కేంద్రం నుంచి కోట్లాధి రూపాయలను వివిధ పథకాల ద్వారా రాబట్టుకోవచ్చని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా అక్కడ పర్యాటక ప్రాంతం ఏర్పాటుతో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాల్సి వుంటుందని, ఇందుకు కూడా కేంద్రం నిధులు దోహదపడతాయని వూమెన్ చాంధీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

ప్రధాన మంత్రి వస్తున్నారన్న సమాచారంతోనే అధికారులు శబరిమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు కూడా సమాచారం లేనప్పటికీ పోలీసులు ప్రధాని తన పర్యటనను ఖరారు చేసుకుంటే ఎలా తీసుకువెళ్లాలన్న రూట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. నెడుంబస్సెరీ వరకు ప్రత్యేక విమానాంలో తీసుకెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రధానిని శబరిమలకు తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం నీలక్కల్ లో హెలిప్యాడ్ నిర్మాణం జరపాలని యోచిస్తున్నారు. ఇలా కాని పక్షంలో పట్టణంతిట్టా నుంచి రో్డ్డు మార్గం ద్వారా శబరిమలకు తీసుకురావచ్చని, అయితే ప్రధాని సెక్యూరిటీ దృష్ట్యా రోడ్డు మార్గం శ్రేయస్కరం కాదని పోలీసులు బావిస్తున్నట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles