Uttarakhand people culture deepavali festival superstitions owl sacrifies

uttarakhand culture, uttarakhand people, owl sacrifies, deepavali festivals, superstitions, uttarakhand superstitions, owl birds, deepavali owl sacrifies, uttarakhand forest ministry

uttarakhand people culture deepavali festival Superstitions owl sacrifies

దీపావళి వేడుకలు.. ప్రబలుతున్న మూఢనమ్మకాలు!

Posted: 10/21/2014 09:50 PM IST
Uttarakhand people culture deepavali festival superstitions owl sacrifies

ఏవిధంగా అయితే భారతదేశం సాంకేతికపరంగా దూసుకుపోతోందో.. అదేవిధంగా మూఢనమ్మకాలు కూడా రానురాను మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. జంతవులను బలివ్వడం, క్షుద్రపూజలు చేయడం, ఇంకా ఇతరత్ర వ్యవహారాలు కొనసాగుతూనే వున్నాయి. మొన్నటివరకు కేవలం గ్రామాలవరకే పరిమితమైన ఇవి.. రానురాను పట్టణాల్లో కూడా మెల్లగా వ్యాపిస్తున్నాయి. అన్నీ తెలిసికూడా కొంతమంది అంధకారాంలో ఇటువంటివాటిని గుడ్డిగానే నమ్మేస్తున్నారు. ఎవడో డోంగ్రీ బాబా ఏదో చెప్పిన మాటలు గ్రహించి, వాటి ప్రకారమే నడుచుకుంటున్నారే తప్ప.. అందులో నిజమెంతో..? అబద్ధమెంతో..? వాటివల్ల ప్రమాదాలు కలుగుతాయా..? లేదా..? అన్నది పట్టించుకోకుండా దారుణాలకు ఒడిగడుతుంటారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఇటువంటి పరిస్థితులే చాలావరకు ఎదురవుతాయి.

ఇదిలావుండగా.. ఉత్తరాఖండ్ లో అయితే ఈ మూఢనమ్మకాలు మరీ ఎక్కువగా వున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా గుడ్లగూబలను బలివ్వడం అక్కడ ఎప్పటినుంచో వస్తున్న ఆచారంగా భావిస్తారు ప్రజలు! ఇలా చేయడం వల్ల తాము కోరుకున్న కోర్కెలన్ని తక్షణమే తీరుతాయన్నది వారి నమ్మకం. అందుకే.. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. వేటగాళ్లందరూ గుడ్డగూబలను పట్టుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో అడుగుల్లోకి పరుగులు తీస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పండుగ సందర్భంగా ఆ ప్రాంతంలో ఒక్కొక్క గుడ్లగూబ ధర రూ.20,000 పలుకుతుంది. అంతేకాదు.. నాలుగు కేజీల కంటే అధిక బరువున్న గుడ్లగూబ అయితే రూ.5 నుంచి రూ.7 లక్షల ధర చెల్లించడానికి కూడా వెనుకాడరట అక్కడి జనాలు!

అందుకే..  గుడ్లగూబలు ఎక్కడుంటాయో తెలియని స్థానాలకు సైతం వెళ్లి మరీ పట్టుకొస్తారట వేటగాళ్ళు! ఉత్తరాఖండ్ ప్రజల ఈ మూఢనమ్మకం వల్ల ఈ గుడ్లగూబ పక్షిజాతికి పెను ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ వాటి భద్రత కోసం పటిష్ఠ చర్యలకు శ్రీకారం చుట్టింది. వాటిని వేటాడేందుకు వచ్చే వేటగాళ్ళను పట్టుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ లను కూడా ఏర్పాటు చేసింది. స్థానిక మార్కెట్లపైనా ఓ కన్నేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూఢాచారాన్ని రూపుమాపేందుకు తాము పోలీసు శాఖ సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పరాగ్ మధుకర్ ధకాటే చెప్పారు. అయితే ఉత్తరాఖండ్ ప్రజల ఆచారవ్యవహారాలను చూస్తుంటే.. గుడ్లగూబలను వదిలే ప్రసక్తే లేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttarakhand culture  deepavali festival  superstitions india  owl birds  forest ministry  

Other Articles