Central finance minister arun jaitley wrote a letter to aims nurse which goes viral

arun jaitley, arun jaitley latest news, central finance minister arun jaitley news, arun jaitley wrote letter to nurse, arun jaitley letter to nurse, arun jaitley press meet, arun jaitley health conditions, aims hospitals, private hospitals, telugu news, telugu political news, telugu movie news, telugu websites

central finance minister arun jaitley wrote a letter to aims nurse which goes viral in india

నర్సుపై మనసు పారేసుకున్న మంత్రి అరుణ్ జైట్లీ!

Posted: 10/21/2014 09:17 PM IST
Central finance minister arun jaitley wrote a letter to aims nurse which goes viral

బీజేపీ అధికారంలో ఆర్థికమంత్రిగా కొనసాగుతున్న 61ఏళ్ల అరుణ్ జైట్లీ తాజాగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... ఆయన ఒక నర్సుపై మనసు పారేసుకున్నారని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు! దీనికంతటికి కారణం ఏమిటంటే.. ఈయనగారు ఒక నర్సుకు లేఖ రాయడమే! ఈ విషయం తెలుసుకున్న ప్రతిఒక్కరు ఆ లేఖలో ఏముందంటూ తెగ ఆరాటపడిపోతున్నారు. ఇంతవరకు ఎవరికీ లెటర్ రాయని అరుణ్.. హఠాత్తుగా ఒక నర్సుకు లేఖ రాయాల్సిన అవసరమేమొచ్చిందంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు.

అరుణ్ జైట్లీ నర్సుకు లేఖ ఎందుకు రాశారంటే... ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై ఎయిమ్స్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే! ఆయన అనారోగ్యంగా బాధపడుతున్న సమయంలో అక్కడ బాగోగులు చూసుకోవడానికి ఒక నర్సుకు పనులు అప్పగించారు. దాంతో ఆమె అరుణ్ కి ఏ లోటు లేకుండా అన్నిరకాలుగా బాగానే చూసుకుంది. ఈ విధంగా ఆ నర్సు తను ఆసుపత్రిలో అందించిన సేవలు ఎంతో అమోఘమని అరుణ్ ఆమెను కొనియాడారు. ఆమె ఎంతో సమర్థవంతంగా, ప్రొఫెషనల్ తరహాలో తన పట్ల వ్యవహరించడాన్ని గొప్పగా భావిస్తున్నానంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అదీ సంగతి!

ఇదిలావుండగా.. నిజానికి అరుణ్ జైట్లీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అక్కడే నెలరోజులపాటు చికిత్సం పొందిన ఆయనకు ఇన్ఫెక్షన్ సోకడంతో అక్కడి నుంచి ఎయిమ్స్ కు తరలించారు. దీంతో ఆయన గతనెలలో ఆస్ట్రేలియాలో జరిగిన జి20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సుకు జైట్లీ గైర్హాజరయ్యారు. కొన్ని వారాలకిందటే తిరిగి విధులకు హాజరైన ఆయన.. తనకు మంచి సేవలందించినందుకుగాను కృతజ్ఞత తెలుపుతూ.. ఎయిమ్స్ నర్సుకు లేఖ రాశారు.

arun-jaitley-letter-to-nurse

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles