Fire accodent in faridabad cracker market 200 shops gutted

faridabad news, faridabad cracker accident, faridabad crackers market fire accident, crackers market fire accident, faridabad fire accident latest updates, faridabad dusehra market fire accident, faridabad accident deaths, diwali in india, diwali celebrations in india, haryana latest updates

fire accodent in Faridabad cracker market, 200 shops gutted : in haryana state famous cracker market of faridabad dussehra ground major fire accident broken over 200 cracker shops gutted wth fire, in this accident five people recognised to injured with the fire broke crores of rupees loss to the vendors

దీపావళి చీకట్లు : రోడ్డున పడ్ట 200 కుటుంబాలు

Posted: 10/22/2014 08:05 AM IST
Fire accodent in faridabad cracker market 200 shops gutted

హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంతో రెండు వందల కుటుంబాలు కుదేలయ్యాయి. నగరంలోని ప్రఖ్యాతిగాంచిన దసరా మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్కెట్ లోని 200పైగా షాపులు దహనం అయ్యాయి. ఒక్కసారిగా మొదలైన మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే అన్ని షాపులకు వ్యాపించి చూస్తుండగానే బాణాసంచా పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగటంతో టపాసులు కొనేందుకు వచ్చినవారు, షాపుల నిర్వాహకులు అంతా గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రమాదంలో ఐదుగురు గాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రౌండ్ లో పార్క్ చేసిన వాహనాలు నిర్వాహకుల, కొనుగోలుదారుల పదుల సంఖ్యలో దహనం కావటంతో పాటు.., కొన్ని పాక్షికంగా ద్వంసం అయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాపులన్ని బూడిదగా మారిపోయాయి. ఈ ప్రమాదంపై హర్యానా ప్రభుత్వం ధర్యాప్తు చేపడుతోంది. మంటలు వ్యాపించటానికి షాట్ సర్య్కూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ధర్యాప్తు చే్స్తున్నారు. అంతేకాకుండా ఇందులో కుట్ర కోణం దాగి ఉందా అని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

కళ్ళెదుటే కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అప్పులు తెచ్చి షాపులు నిర్వహించిన తాము.., ఇప్పుడు ఎలా డబ్బులు చెల్లించాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటాసులు అమ్మగా వచ్చిన డబ్బుతో ఆనందంగా పండగ చేసుకుందామనుకుంటే ఈ దీపావళి తమకు చీకట్లనే మిగిల్చింది అని బాధపడుతున్నారు. ప్రమాదంతో బాణాసంచా బూడిదగా మిగలటంతో ఇప్పడు తాము ఎలా పండగ చేసుకోవాలి.. చేసిన అప్పులు ఎలా తీర్చాలి ఆని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ ప్రమాదంకు ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యమే ఆస్తి నష్టం పెరగటానికి కారణంగా వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గ్రౌండ్ లో ఏటా పటాసుల అమ్మకాలు జరుగుతాయని తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అని మండిపడుతున్నారు. షాపుల నిర్వహణకు తమ దగ్గరి నుంచి లైసెన్సుల రూపంలో డబ్బులు తీసుకున్న ప్రభుత్వం.., రక్షణ చర్యలు మాత్రం చేపట్టలేదని మండిపడుతున్నారు. తప్పు ఎవరిదైతేనేం.., నిర్లక్ష్యం ఎవరు చేస్తే ఏం. నష్టపోయింది మాత్రం సామాన్య ప్రజలు..., అప్పులు తెచ్చి షాపులు నడిపిన నిర్వాహకులు.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : faridabad  fire accident  cracker shops  latest updates  

Other Articles