Bangalore court verdict on jayalalitha

jayalalitha, jayalalitha marriage, jayalalitha shoban babu, jayalalitha latest, jayalalitha cm, jayalalitha assets case, aidmk, dmk, banglore court on jayalalitha, jayalalitha case verdict, tamilnadu cm jayalalitha, jayalalitha schemes, tamilnadu, jayalalitha assets case, banglore courts, jayalalitha assets, dmk, aidmk, tamilnadu politics, latest news, banglore police, banglore courts, karnataka

bangalore court gives verdict on tamilnadu chief minister jayalalitha : bangalore court pronounce that jayalalitha convicted in disapproipriation of assets case

‘‘జయమ్మ’’ ‘దోషి’గా తేలింది : అప్ డేట్స్

Posted: 09/27/2014 01:10 PM IST
Bangalore court verdict on jayalalitha

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలింది. బెంగళూరు కోర్టు.., ఈమేరకు శనివారం తీర్పు వెల్లడించింది. 18ఏళ్ళ క్రితం నమోదయిన కేసులో సుదీర్ఘ విచారణల తర్వాత కోర్టు తీర్పు వెల్లడించింది. జయలలితపై వచ్చిన అక్రమాస్తుల అభియోగాలు వాస్తవమే అని తేల్చింది.

అప్ డేట్స్

మధ్యాహ్నం 1గంట తర్వాత జయలలితకు విధించే శిక్షపై తీర్పు వెల్లడికి అవకాశం

జయలలితపై అక్రమాస్తుల ఆరోపణలు రుజువయినట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

బెంగళూరు కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు, భారీగా చేరుకున్న జయ మద్దతుదారులు

కోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్న పోలిసులు

బెంగళూరు కోర్టు సమీపంలో ఆంక్షలు అమలు చేస్తున్న పోలిసులు

కోర్టులోకి తమిళనాడు మంత్రులను అనుమతించని పోలిసులు

మీడియా, లాయర్ల కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్ల ఏర్పాటు

కేసు వివరాలవి

1991-96 మద్య తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. ఆ సమయంలో దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లి కోసం ఏకంగా రూ. 5కోట్లు ఖర్చు చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. జయ అక్రమంగా ఆస్తులు కూడబెట్టింది కాబట్టే.., ఇలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని విమర్శలు వచ్చాయి. ఆస్తులపై విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు. దీనిపై 18సంవత్సరాల పాటు ధర్యాప్తు, విచారణ జరిగింది.


1996 జూన్లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు
జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్లో ఛార్జిషీటు దాఖలు చేశారు
అక్టోబర్లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి
2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు
విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు.
2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు
2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు
దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్ను తప్పించింది.
తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు.
కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు.
2014 ఆగస్టులో విచారణ పూర్తయింది.
శనివారం రోజు జడ్జి మైఖేల్ జయలలితను దోషిగా నిర్ధారిస్తూ తీర్పుఇచ్చారు.

కార్తిక్

సంబంధిత వార్తలు:

తమిళనాడు సీఎం జయలలిత భవితవ్యం.. ఏమిటీ..?

ఆమ్మ ఆస్తులపై కోర్టు తీర్పు నేడే..

తమిళనాడులో ఉద్రిక్తలు, పోలీసులు లాఠీచార్జ్..

తమిళనాడులో ఉద్రిక్తలు, పోలీసులు లాఠీచార్జ్..

ఆమ్మ ఆస్తులపై కోర్టు తీర్పు నేడే..
తమిళనాడు సీఎం జయలలిత భవితవ్యం.. ఏమిటీ..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  banglore court  assets  latest news  

Other Articles