Pellitho zara bhadram video on youtube creating sensation

pellitho zara bhadram, pellitho zara bhadram video youtube, youtube videos, bhadram videos, bhadram official youtube channel, marriage life

pellitho zara bhadram video on youtube creating sensation

పెళ్లితో జర భద్రం.. లేకపోతే డెలీవరీ బాయ్ లే!

Posted: 09/19/2014 05:00 PM IST
Pellitho zara bhadram video on youtube creating sensation

మానవ జీవితంలో ఎప్పుడో ఒకనాడు.. ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకోక తప్పదు. కొంతమంది ఈ పెళ్లిని వరంగా భావిస్తే.. మరికొందరు మాత్రం శాపంగా భావిస్తారు. ఇక్కడ మహిళల అంతర్గత భావాలు పక్కనపెడితే.. మగాళ్లే పెళ్లయిన తర్వాత ఎక్కువ నరకం అనుభవిస్తుంటారని వారి ఆలోచన! ఎందుకంటే.. పెళ్లికాకముందు బ్యాచులర్ లైఫ్ లో ఏమైనా చేసుకోవచ్చు.. ఎక్కడికైనా చెడుతిరుగుళ్లు తిరగొచ్చు.. సంతోషంగా తమకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవచ్చు.. కానీ పెళ్లైన తర్వాత ఇవన్నీ వుండవు. ఎందుకంటే.. పెళ్లైన తర్వాత భర్తకు తమ భార్య కోరికల్ని తీర్చడంలోనే సమయం అయిపోతుంది.

పైగా ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినా.. ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడినా.. ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్లినా.. భార్యకు ఖచ్చితంగా అనుమానం వచ్చే తీరుతుంది. ఎందుకు, ఎక్కడ, ఏమిటి..? అనే ప్రశ్నలు వారినుంచి ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. అంతేకాదుబాబోయ్.. వారి కోరికల్ని తీర్చకపోతే అప్పుడు వుంటుంది అసలు తడి.. ! ఈ విధంగా ఒక కథానేపథ్యంలో భద్రం అనే వ్యక్తి యూట్యూబ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో పెళ్లైన ఒక వ్యక్తి ఎలా బాధపడుతాడోననే ఆవేదనను క్లుప్తంగా విశదీకరించాడు. ఒకవసారి దానిని మీరు ఆస్వాదించండి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles