277 feared dead in jk floods

Jk floods, omer abdullah, 277, fear dead

277 feared dead in JK floods, CM abdullah

జమ్మూకాశ్మీర్‌లో వరద 277 మందికి పైగా మృతి.

Posted: 09/19/2014 04:07 PM IST
277 feared dead in jk floods

జమ్మూకాశ్మీర్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలు సుమారుగా 277 మందిని బలితీసుకున్నాయి, నగరాలు, పట్టణాలు, పల్లెలు, ఇళ్లు అన్ని జలమయమయ్యాయి. ఏకంగా పది రోజుల పాటు వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో.. జలవలయంలో చిక్కుకున్న అనేక మంది అభాగ్యులు వారి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ జమ్మూకాశ్మీర్ లో జనజీవనం సాధరణ స్థితికి చురుకోలేదు. పలు ఇళ్లు, కాలనీలలో ఇంకా వరద నీరు, బురద ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ సహాయ శిభిరాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు.

సుమారు రెండు శతాబ్దాల తరువాత వచ్చిన వరదలతో తమ రాష్ట్రం ఊహించిన దానికన్నా పలు రెట్లు ఎక్కువ నష్టపోయిందని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో ఇటీవల వచ్చిన భయంకర వరదల్లో 277 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 10 రోజుల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వరదల వల్ల జమ్మూ ప్రాంతంలో 210 మంది మృత్యువాతపడ్డారని, కాశ్మీర్ ప్రాంతంలో 60మందికి పైగా మరణించారని ఆయన పేర్కొన్నారు. 1892 తర్వాత ఇంతటి భయంకర వరదలు ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. ఈ వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు, పంటలు అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టం వూహించిన దానికంటే పలురెట్లు ఎక్కువ ఉంటుందన్నారు.

తమ రాష్ట్రాన్ని వరద బీభత్సం నుంచి తెరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలు తమ వంతు సాయాన్ని అందించాలని కోరారు. ఇప్పటికీ గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయన్నారు. జమ్మూశాశ్మీర్ వాసులు అంటువ్యాదుల పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు. రెండు శతాబ్ధాల అనంతరం వచ్చిన ఈ వరదలలో కాశ్మీర్ అందాలను వీక్షించడానికి పర్యాటకులు కూడా ఇప్పడప్పుడే రారని ఓమర్ అబ్దుల్లా అన్నారు. అయితే అధికారిక గణాంకాలు 277 మంది మరణించారని చెబుతున్నా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని.. స్థానికులు చెబుతున్నారు. తాము చాలా మృతదేహాలను చూశామని అంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jk floods  omer abdullah  277  fear dead  

Other Articles