Ou jac warnings to pawan kalyan to not campaign in medak district

pawan kalyan, ou jac, ou jac leader pidamarthi ravi, medak mp seat, medak lok sabha by elections, medak parliament by elections, mp kavitha, minister harish rao, pawan kalyan latest news, pawan kalyan janasena

ou jac warnings to pawan kalyan to not campaign in medak district : ou jac leader pidamarthi ravi controversial comments on pawan kalyan that they will throw stones on him if he campaign for bjp party member jagga reddy in medak district elections

పవన్ కల్యాణ్ పై రాళ్లతో దాడి.. ఓయూ హెచ్చరిక!

Posted: 08/28/2014 03:57 PM IST
Ou jac warnings to pawan kalyan to not campaign in medak district

మెదక్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరఫున జగ్గారెడ్డి బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే! నిన్నమొన్నటివరకు బీజేపీ పార్టీ ఆ స్థానంకోసం వేరే అభ్యర్థిగా ప్రకటించన నేపథ్యంలో కేవలం ఒక్కరోజు తేడాతో జగ్గారెడ్డిని ఎంపిక చేయడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఖచ్చితంగా పవన్ కల్యాణ్ హస్తముందని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీవాళ్లు జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రత్యక్షంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావులు పవన్ మీద సెటైర్లు వేసిన విషయం విదితమే!

ఈ నేపథ్యంలోనే తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా పవన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓయూ జేఏసీ, పవన్ కల్యాణ్ కు ఒక హెచ్చరిక జారీ చేసింది. జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేయడానికి మెదక్ జిల్లాకు వస్తే అతనిపై రాళ్లదాడి చేస్తామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాన ప్రజలు పవన్ కల్యాణ్ ను బండకేసి కొట్టారని.. ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తే వినేవారు ఎవ్వరూ లేరని అన్నారు. ఒకవేళ పవన్ కల్యాణ్ మెదక్ జిల్లాకు వస్తే.. తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆయనకు హెచ్చరికలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  ou jac  harish rao  mp kavitha  medak elections  jagga reddy  

Other Articles