Nizamabad mp kalwakuntla kavitha controversial comments pawan kalyan

kalvakuntla kavita latest news, mp kavitha, nizamabad mp kavitha, kavitha latest news, kavitha pawan kalyan kavitha news, kavitha pawan kalyan news, pawan kalyan, bjp party, trs party, tdp party

nizamabad mp kalwakuntla kavitha controversial comments pawan kalyan that telangana people has already ignores all parties include with pawan also so that this time medak seat will win trs party

టీఆర్ఎస్ ఎంపీ కవిత నోట.. జనసేన పవన్ మాట!

Posted: 08/28/2014 02:53 PM IST
Nizamabad mp kalwakuntla kavitha controversial comments pawan kalyan

జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వున్న సంగతి తెలిసిందే! పవన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చుకుని తన పార్టీ స్థాపించిన నేపథ్యంలో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులను విమర్శలతో ఏకిపారేశారు. అయితే పవన్ చేసిన విమర్శలకు కేసీఆర్ కూడా ధీటుగా తిప్పికొట్టారు. అలాగే ఆయన కుమార్తె కవిత, తనయుడు కేటీఆర్, హరీష్ తదితర కుటుంబసభ్యులు కూడా పవన్ పై విరుచుకుపడ్డారు. అప్పటినుంచి మొదలైన వీరి రాజకీయ పోరాటం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకర్నొకరు తిట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ప్రస్తుతం తాజాగా ఆమె మరోసారి పవన్ కల్యాణ్ ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేశారు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కు దిమ్మతిరిగిపోయేలా తెలంగాణ ప్రజలు ఫలితాలను ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో వున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఇప్పుడు ఎన్ని డబ్బులు ముట్టజెప్పి బీజేపీలో చేరారో చెప్పాలన్నారు. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాల్సిందేనని ఆమె సవాల్ విసిరారు. నిన్నమొన్నటివరకు తిట్టుకున్న జగ్గారెడ్డి, కిషన్ రెడ్డిలు.. ఇప్పుడు ఇలా కలిసిపోవడం చాలా విడ్డూరంగా వుందని.. కిషన్ రెడ్డి, జగ్గారెడ్డి మాట్లాడటం విచిత్రంగా వుందని అన్నారు.

అలాగే.. తమపైనగానీ, తమ పార్టీపైనగానీ విమర్శలు చేస్తే హెచ్చరించేది లేదని టీడీపీ, బీజేపీ పార్టీలతోపాటు పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు. గతంలో మతతత్వ పార్టీ అంటూ దూరం పెట్టిన చంద్రబాబు.. తన రాజకీయస్వార్థం కోసమే ఇలా పొత్తుపెట్టుకున్నారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను తిరస్కరించాయని.. మెదక్ జిల్లా ఎంపీ సీటు కూడా తమకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ చొరవతోనే జగ్గారెడ్డి బీజేపీ పార్టీలోకి జంప్ అయ్యారనే వార్తల నేపథ్యంలో.. ఎంపీ కవిత ఇలా పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kalvakuntla kavita  pawan kalyan  bjp party  medak mp seat  bjp party  jagga reddy  

Other Articles