Kannada actress mythriya filed rape case on central minister sadananda gowda son karthik gowda

central minister sadananda gowda, sadananda gowda son karthik gowda, kannada actress mythriya, actress mythriya latest news, actress mythriya rape case, karthika gowda rape case

kannada actress mythriya filed rape case on central minister sadananda gowda son karthik gowda

రేప్ కేసులో బీజేపీ సదానంద కొడుకు.. నటి మైత్రేయి ఫిర్యాదు!

Posted: 08/28/2014 04:44 PM IST
Kannada actress mythriya filed rape case on central minister sadananda gowda son karthik gowda

బీజేపీ రాజకీయ ప్రస్థానంలో రానురాను కొత్త వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం మూడునెలలు మాత్రమే అవుతున్నా... ఆ పార్టీలోని సీనియర్ నాయకుల బాగోతాలు అప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న రాజ్ నాథ్ సింగ్ కుటుంబం మీద వచ్చిన ఆరోపణల మీద ఇంకా క్లారిటీ రాకుముందే... ఆ పార్టీకి చెందిన మరో కేంద్రమంత్రి సదానంద గౌడ కుటుంబం మీద ఒక పెద్ద వివాదం వచ్చిపడింది.

కేంద్రమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి వదిలేశాడంటూ కన్నడ వర్ధమాన నటి మైత్రేయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! దాంతో పోలీసులు కార్తీక్ పై కేసు నమోదు చేశారు. అలాగే బాధితురాలిని (నటి మైత్రేయి) వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకవేళ ఈ వైద్యపరీక్షల నివేదికలో ఆమెపై అత్యాచారం చేసినట్లు వెలువడితే.. కార్తీక్ ను అరెస్టు చేయడం ఖాయం!

ఈ విషయంపై మైత్రేయి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మే నెలలో తన స్నేహితుడు కుషాల్ అనే వ్యక్తి ద్వారా కార్తీక్ గౌడ పరిచయమయ్యాడని పేర్కొంది. అనంతరం వారిమధ్య స్నేహం బలపడిందని, వీలుదొరికినప్పుడల్లా మాట్లాడుకునేవాళ్లమని చెప్పింది. తర్వాత జూన్ 5వ తేదీన కార్తీక్ మంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించడాని పేర్కొంది. అయితే పెళ్లికి ముందు ఇలాంటివి చేయడం ఇష్టంలేదని తాను చెప్పడంతో.. వెంటనే ఒక పసుపుతాడు తీసుకుని తన మెడలో కట్టాడని తెలిపింది. దాంతో తాను అతని మీద నమ్మకంతో శారీరక సంబంధానికి ఒప్పుకున్నానని.. అప్పటినుంచి తామిద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్లమని వివరించింది.

అయితే నలుగురిలో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా తాను కోరడంతో.. జూలై 25వ తేదీ నుంచి కార్తీక్ మాట్లాడటం మానేశాడని తెలిపింది. చివరికి ఈ విషయం గురించి అతని తల్లికి ఆగస్టు 11వ తేదీని వివరించినప్పటికీ.. ఆమె కూడా బెదిరించి తనను పంపినట్లు తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో అతడికి నిశ్చితార్థం జరుగుతోందని విషయం తెలుసుకున్న తర్వాత షాక్ కు గురయ్యానని.. తనను ముందుగానే పెళ్లి చేసుకుని ఇలా మోసం చేయడం తగదని ఆమె అంటోంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని ఆమె ఆ ఇంటర్య్యూలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో నటి మైత్రేయి తనపై కార్తీక్ అత్యాచారం చేశాడంటూ ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మైత్రేయి, కార్తీక్ పై కేసు పెట్టినట్లు సిటీ కమిషనర్ ఎంఎస్ రెడ్డి కూడా తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తనను అత్యాచారం చేసి వదిలేశాడని ఆ నటి నేరారోపణలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వారు కార్తీక్ పై చీటింగ్, రేప్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అటు ఈ విషయాన్ని కేంద్రమంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయకోణం వుందని.. ఎవరో కావాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ తన కొడుకు మైత్రేయికి అన్యాయం చేసి వుంటే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు కార్తీక్ కూడా తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చాడు. తన తండ్రి గౌరవాన్ని దిగజారిపోయేంత పనికిమాలిన పనులు తాను చేయనని, మైత్రేయిని తాను మోసం చేయలేదని.. కావాలని ఆ నటి తనపై ఆరోపణలు చేస్తోందని తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles