Cm chandrababu naidu clarification on ap capital

chandrababu naidu, ap capital city, chandrababu naidu narendra modi, narendra modi news, narendra modi chandrababu naidu, chandrababu naidu press meet, chandrababu naidu ap capital city

cm chandrababu naidu clarification on ap capital : after met with narendra modi in delhi.. chandrababu naidu finally give a clarification about capital of ap

ఎట్టకేలకు ఏపీ రాజధాని మీద బాబు క్లారిటీ!

Posted: 08/27/2014 12:14 PM IST
Cm chandrababu naidu clarification on ap capital

విభజన అయి మూడునెలల కావచ్చినా.. ఇంకా ఏపీ రాజధాని కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం ప్రజలకు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చుకున్నారు. రాష్ట్ర విభజన పద్దతిప్రకారం జరగకపోవడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో చాలా సమస్యలు వున్నాయని.. వాటివల్ల రాజధాని ఎక్కడా..? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేక పోతున్నామని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేవలం రాజధాని సమస్యే కాదు... ఇంకా చాలా సమస్యలున్నాయని చెప్పిన ఆయన... వాటినుంచి కోలుకోవడానికి చాలాసమయం పడుతుందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే మాట్లాడిన ఆయన.. రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇంకా రాలేదన్నారు. అన్నీ పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు. అయితే ఫైనల్ గా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రజాభీష్టం మేరకే నిర్ణయించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజధానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రధాన నగరాలన్నింటినీ కూడా అభివృద్ధిపర్చాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. తమ టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేయదని.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను పూర్తి చేస్తానని మరోసారి మాటిచ్చారు.

అలాగే రాష్ట్రంలో 7500 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయని.. అక్టోబరు 2వ తేదీ నుంచి నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బాబు స్పష్టంచేశారు. కాకినాడ-విజయవాడ లైన్‌లో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని పెట్రోలియం శాఖ మంత్రిని కోరామన్నారు. త్వరలోనే ఏపీలో మరిన్ని నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రితోపాటు పలువురు నేతలను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజధాని, అభివృద్ధి విషయాలమీద ఇలా పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  narendra modi  ap capital city  sivarama krishnan committee  

Other Articles