Congress party district president devamma controversial comments on pcc chief raghuveera reddy

congress party district president devamma, pcc cheif raghuveera reddy, raghuveera reddy latest news, raghuveera reddy news, raghuveera reddy devamma, district president devamma news, congress party, congress party news

congress party district president devamma controversial comments on pcc chief raghuveera reddy

కాంగ్రెస్ నాశనానికి రఘువీరారెడ్డి కారణమా!

Posted: 08/27/2014 01:39 PM IST
Congress party district president devamma controversial comments on pcc chief raghuveera reddy

విభజన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ ద్వారా పీసీసీ చీఫ్ గా ఎన్నుకోబడిన రఘువీరారెడ్డి.. ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచారా..? సిన్సియారిటీ, సీనియారటీ వున్న వ్యక్తిగా పేరుసంపాదించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను పీసీసీగా గద్దెనెక్కిస్తే... ఆ పార్టీ నామరూపాలు లేకుండా ఆయన ప్రణాళికలు రచించారా..? అంటూ ప్రస్తుతం రఘువీరాపై ఆ పార్టీ శ్రేణులే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా నాశనం అవడానికి కేవలం రఘువీరారెడ్డియే కారణమంటూ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షరాలు దేవమ్మ ఆరోపణలు చేశారు.

మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన దేవమ్మ.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాశనం కావడానికి గల కారణాలు, పీసీసీ చీఫ్ రఘువీరా పనితీరుపై సోనియాగాంధీకి ఒక నివేదిక సమర్పించినట్లు ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. రఘువీరా రెడ్డి నాలుగు స్థంభాల ఆట ఆడుతున్నాడని ఆమె ఆరోపించారు. పౌరసఫరాల శాఖమంత్రి పరిటాల సునీతతో, బీజేపీ నాయకులతో, వైఎస్సార్‌సీపీ నాయకులతోతోపాటు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో తనకున్న పరిచయాలను వ్యాపార లావాదేవీలుగా మార్చుకుని.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడని రఘువీరాపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో పరిటాల సునీత ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల శాసనసభ, పార్లమెంటు సీట్లు కేటాయించడం గమనిస్తే ఆయన రాజకీయ నాటకం ఏంటో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇందులో భాగంగానే దేవమ్మ.. ‘‘ఒకప్పుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేస్తామని నమ్మబలికిన రఘువీరా.. ఇప్పుడు టీడీపీ పార్టీతో చేతులు కలిపి జగన్ పై కేసులు బలపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. దీంతో అతనిపై చర్యలు వీలైనంత త్వరలో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సోనియాకు నివేదిక సమర్పించినట్లు ఆమె పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles