Telangana cm kcr fire on ministers performance in state

kcr, cm kcr, kcr latest news, kcr news, kcr fires on ministers, kcr new branches, telangana ministers branches, telangana ministers, trs party ministers, trs party leaders, trs latest news, kcr press meet

telangana cm kcr fire on ministers performance in state : cm kcr fire on ministers performance in telangana state. So he decided to change the branches of ministers

మంత్రులను పీకిపారేస్తున్న సీఎం కేసీఆర్!

Posted: 08/27/2014 12:01 PM IST
Telangana cm kcr fire on ministers performance in state

నిన్నమొన్నటివరకు తెలంగానా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు పార్టీ మీద, మంత్రులపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన రాష్ట్రమంత్రుల పనితీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నప్పటికీ.. కనీసం వారి శాఖలపై కూడా మంత్రులు సరిగ్గా అవగాహన తెచ్చుకోలేకపోయారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంత్రుల పనితీరు ఏమాత్రం బాగోలేదని అభిప్రాయపడిన ఆయన.. వారి పేషీలు కూడా చాలా అధ్వానంగానే వున్నాయని మండిపడుతున్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్ డీల వ్యవహారశైలిపై కేసీఆర్ కు అనేక అభ్యంతరాలు అందుతున్నాయి. వారి చాంబర్లలో జరుగుతున్న అపసవ్య ధోరణులు కూడా కేసీఆర్ దృష్టికి వచ్చాయి. దీంతో బయటపడిన వారి పనితీరుపై తీవ్ర ఆగ్రహావేశానికి గురైన కేసీఆర్.. వారికి క్లాస్ పీకనున్నట్టు సమాచారం!

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన మంత్రివర్గంలో భారీఎత్తున్న మార్పులు, చేర్పులు చేయాలనే దిశలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే మంత్రులకు తమ శాఖల మీద, ప్రజాసంక్షేమ పథకాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. వచ్చే దసరాలోపు పలువురు మంత్రులకు మాంచి క్లాస్ పీకడమో లేదా వారిని సదరు శాఖల నుంచి పీకేసి వేరే శాకలను మార్చడమోగానీ చేయవచ్చునన్ని తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తిస్థాయిలో ఆయన మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పూర్తిగా నిమగ్నమైనట్టు తెలుస్తోంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా పొందడానికే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సాధ్యమైనంతవరకు తన పార్టీని బలోపేతం చేసుకుని, పూర్తిగా విస్తరించుకుంటే... ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టేందుకు వీలుగా వుంటుందని.. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవచ్చునని ఆయన భావిస్తున్నారు.

మంత్రుల పనితీరు బాగాలేకపోతే.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తరుణంలో తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా మంత్రుల పనితీరును మార్చుకోవాలంటూ కేసీఆర్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజావిశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొన్ని చేదు నిర్ణయాలు తీసుకోక తప్పదని నిర్ణయించారు. అంటే.. మంత్రుల శాఖలను మార్చడమోగానీ లేదా వారి స్థానంలో కొత్త మంత్రులను నియమించడమోగానీ జరిగే అవకాశాలున్నాయి. కేసీఆర్ అభిప్రాయాన్ని బట్టి చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana ministers  trs party ministers branches  trs party  

Other Articles