Doctors risk treating contagious ebola virus in africa

Ebola virus Africa, Ebola virus Guinea and Liberia, doctors risk Ebola virus, Ebola virus no remedy

Doctors risk treating Contagious Ebola virus in Africa: Volunteer doctors fighting ebola virus facing personal risk

ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు

Posted: 07/30/2014 05:56 PM IST
Doctors risk treating contagious ebola virus in africa

ప్రాణం పోయటానికి వున్న ఈ వైద్య వృత్తిలో మనకేదో అంటుకుంటుందని భయపడితే పని జరగదన్నారు 27 సంవత్సరాల డాక్టర్ హన్నా స్పెన్సర్.  ఆఫ్రికాని వణికిస్తున్న ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ 1200 మందికి సోకింది, అందులో 600 మంది ప్రాణాలు కోల్పోయారు.  జినీవా, లిబేరియాలో ఆ వ్యాధితో పోరాడటం కోసం డాక్టర్స్ విదౌట్ బోర్డర్స్ లో స్వచ్ఛందంగా వైద్య సేవ చెయ్యటానికి చేరిన స్పెన్సర్, కంటికి కనిపించని ఆ వ్యాధితో పోరాడటమే తన ధ్యేయమన్నారు.  

ప్రాంతకమైన ఎబోలా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎన్నో దేశాల బోర్డర్స్ ని క్లోజ్ చేసారు

Ebola Map of West Africa showin

డాక్టర్లకు వ్యాధి సోకకుండా-

గాలిలోంచే అంటువ్యాధి వ్యాపిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలోకి పోవటమే అపాయం.  కానీ డాక్టర్లకు తప్పదు కదా.  అందుకని వేడిగాలిని పొరలలో బంధించి వున్న హజ్మత్ సూట్ ని ధరించి పనిచేస్తున్నారు.  అందులో నేను చాలా సురక్షితంగా ఉన్న భావన కలుగుతోందని డాక్టర్ స్పెన్సర్ అన్నారు.  కానీ ఆ వేడి సూట్ లో ఉన్న డాక్టర్లు గంటకి కొన్ని లీటర్ల చెమటను కార్చటం జరుగుతుంది.  

డాక్టర్లనూ వదలని వ్యాధి-

తమంతట తాము వాలంటీర్లుగా వచ్చిన డాక్టర్లను నాలుగు నుంచి ఆరు వారాల వరకే పనిచెయ్యటానికి అనుమతించటం జరుగుతోంది.  ఇది ఎందుకంటే, డాక్టర్ కెంట్ బ్రాంట్లీ (33), నాన్సీ రైట్ బోల్ (60) లకు ఎబోలా వైరస్ సోకి వాళ్ళు మృత్యువుతో పోరాడుతున్నారు.  డాక్టర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండటం కోసం ఇప్పుడు మోకాలు వరకు వచ్చే మందమైన రబ్బర్ బూట్లు, రంధ్రాలు లేని, వంటికి ఎటువంటి ద్రవపదార్థాలనూ లోపలికి రానీయని సూట్లు, ముఖానికి మాస్క్ ధరించి డాక్టర్ల చర్మానికి బయటి గాలి సోకని విధంగా ఏర్పాట్లు చేసుకుని వైద్య సేవలు చేయవలసివస్తోంది.  

అంతేకాదు వాళ్ళ నాలుగు ఆరు వారాల సేవా కాలం అయిపోయన తర్వాత వాళ్ళు ధరించిన వాటిని కూడా వ్యాధి అంటుకునే అవకాశం లేకుండా రకరకాల స్ప్రేలు కూడా చేస్తున్నారు.  

డాక్టర్లు ధరించే వేడి సూట్లతో సమస్య

ఇది డాక్టర్లకు వ్యక్తిగతంగా వేడి వలన వచ్చే సమస్య కాకుండా వృత్తి పరంగా ఎదురైన సమస్య.  డాక్టర్లు చెప్పిన అనుభవాలలో మరో విశేషమైనదేమిటంటే, వైద్యులు సామాన్యంగా ముందు రోగితో మాట్లాడి వాళ్ళకి స్వాంతన కలుగజేసి వాళ్ళను ట్యూన్ చేసుకుంటారు.  నాలుగు మాటలతో ప్రేమగా పలకరించి పని మొదలు పెడతారు కానీ ఆ సూట్ లో అసలు మనుషులా, రోబాట్ లా, లేక వేరే గ్రహం నుంచి వచ్చినవాళ్ళా అన్నట్లుగా కనిపించే డాక్టర్లతో రోగులు కలిసిపోయి ప్రశాంతచిత్తులవటానికి మామూలుగా కంటే చాలా ఎక్కువ సమయం పడుతోందంటున్నారు.  

వ్యాపిస్తున్న వ్యాధికి ఇంకా ఔషధాలు లేవు

అన్నిటికన్నా ఎక్కువ రిస్క ఉన్నది అక్కడ చనిపోయినవారికి చేసే అంత్యక్రియలని డాక్టర్లు చెప్తున్నారు.  అంత్యక్రియలకు వచ్చే వాళ్ళు ఆరోగ్యవంతులే.  కానీ వాళ్ళు ఎబోలా వ్యాధితో చనిపోయినవారి దగ్గరకు పోయిన తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వస్తారని నమ్మలేమని అంటున్నారు.      

ఎబోలా వ్యాధిని నిర్మూలించే దిశగా ఎటువంటి ఫలప్రదమైన ప్రయత్నాలు జరగలేదని, కేవలం రోగుల శరీరంలో డిహైడ్రేషన్ ని తగ్గించేందుకు ప్రయత్నాలే జరుగుతున్నాయి, ఇంకా వాంతులు విరోచనాలు అరికట్టటానికి మందులు ఇవ్వటం జరుగుతోందని డాక్టర్లు వాపోతున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles