Sea plane between vizag and chennai

Sea plane between Vizag and Chennai, Sea plane project to develop tourism, Tourism development increases AP Income, Tourism development increase employment opportunities

Sea plane between Vizag and Chennai: Sea plane, convention halls, development of beaches in AP to promote tourism

విశాఖ చెన్నైల మధ్య సీ ప్లేన్ ప్రాజెక్ట్ రెడీ

Posted: 07/30/2014 05:27 PM IST
Sea plane between vizag and chennai

సీ ప్లేన్ సముద్రం మీద లాండ్ అవగలదు, సముద్రం నుంచి టేకాఫ్ చెయ్యగలదు కాబట్టి విశాఖ నుంచి చెన్నైల మధ్య ఈ విమానయానం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పర్యాటకరంగంలో భావిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ ప్లేన్ ని విశాఖపట్నంలో టూరిజం డెవలప్ మెంట్ కి ఉపయోగిస్తారు.  పర్యాటకరంగంలో అభివృద్ధి సాధించటం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలమని గాఢంగా నమ్ముతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు ప్రణాళికను సిద్దం చేయిస్తున్నారు.  అందుకు బుధవారం సమ్మతిని తెలియజేస్తూ త్వరలోనే ఒప్పందాల (ఎమ్ఓయు) మీద సంతకాలు చెయ్యబోతున్నారు.  

ఈ రకమైన పర్యాటక సేవలు అండమాన్ నికోబార్ ద్వీపాల మీద ఇప్పటికే ఉన్నాయి.  గోవా కూడా త్వరలో సీ ప్లేన్ ప్రాజెక్ట్ ని లాంచ్ చెయ్యటానికి చూస్తోంది.  

చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో సీ ప్లేన్ తో పాటు పర్యాటకులను ఆకర్షించటానికి మరెన్నో ప్రణాళిక మీద చర్చలు జరిగాయి.  అందులో, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, దేవాలయాలను పర్యాటక స్థలాలుగా తీర్చి దిద్దటం, కోస్టల్ లైనంతటిలోనూ బీచ్ లను అభివృద్ధి చెయ్యటం కూడా ఉన్నాయి.  

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెయ్యటం వలన ఆదాయమే కాకుండా ఉపాధి కూడా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles