Petrol cooking gas price rise

Petrol cooking gas price rise, Modi Govt raises Gas and petrol rate, Petrol rate hike international market, Petrol subsidy cost Govt lakhs of crores

Petrol cooking gas price rise by Modi Govt when prices of daily commodities on rise

మరోసారి మోదిన మోదీ ప్రభుత్వం- పెట్రోల్, ఎల్పిజి వాత

Posted: 07/30/2014 06:49 PM IST
Petrol cooking gas price rise

మోదీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని ఒకపక్క ఆరోపణలు వెల్లువెత్తుతుంటే పెట్రోల్, వంటగ్యాస్ మీద కూడా మోత మరోసారి మోగిస్తోంది.  పెట్రోల్ ధర లీటర్ కి రూ.1.60, సబ్సిడీ వంటగ్యాస్ మీద రూ.3.46, సబ్సిడీ లేని గ్యాస్ మీద రూ.16.50 చొప్పున రేట్లను పెంచటం జరిగింది.  

దీనిమీద ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వివరణనిచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ధర బ్యారెల్ కి 4 డాలర్లు పెరిగిందని, దానితో పాటు డాలర్ కి ప్రతిగా ఇండియన్ రూపాయి ధర పడిపోయిందని, దాని వలనే పెట్రోల్ రేటుని పంచవలసి వచ్చిందని తెలియజేసింది.

డీజిల్ ధరను యుపిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే దాని మీద సబ్సిడీని ఒక్కసారిగా కాకుండా ప్రతి 15 రోజులకు 0.50 పైసల చొప్పున పెంచటాన్ని కొనసాగించటం జరిగింది.  పక్షం రోజులకోసారి పెట్రోల్, వంట గ్యాస్ ధరలను అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా మార్చటం (పెంచటం కాని తగ్గించటం కానీ) జరుగుతోంది.  అదే సమయంలో డీజిల్ ధరను 0.50 పైసలు పెంచటం కూడా జరుగుతోంది.  

అయితే కాస్త ఊరట కలిగించటానికన్నట్లుగా రైల్వే శాఖ ప్రతిపాదించిన నెలసరి సీజన్ టికెట్ ధర పెంపుని నిలిపివేయటం జరిగింది.  

సబ్సిడీల వలన ప్రభుత్వాని భారం, ఆయిల్ కంపెనీలకు నష్టం ఎంత డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ల మీద ప్రభుత్వానికి మొత్తం 1,15,548 కోట్ల రూపాయల భారం పడుతోంది.  అందులో వంటగ్యాస్ మీద 50,324 కోట్లు, కిరోసిన్ మీద 29, 488 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది.  2013-14 లో కేంద్ర ప్రభుత్వం 70,772 కోట్ల రూపాయలను, ఆయిల్ సంస్థలు 67,021 కోట్ల రూపాయలను భరించటం జరిగింది.  

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడిచేసినదాని ప్రకారం ఆయిల్ కంపెనీలు డీజిల్ మీద లీటర్ కి రూ.3.40, కిరోసిన్ మీద 33.07, 14.2 కిలోల వంట గ్యాస్ మీద రూ.449 నష్టపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు సబ్సిడీల వలన నికరంగా 1,07,850 కోట్ల రూపాయల నష్టాలను భిరస్తున్నాయని ఇండియన్ ఆయిల్ సంస్థ చెప్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles