Kavita comments on telangana not part of india

Kavita comment on telangana, Kavita comments on Telangana not part of India, Kavita comments on Telangana and Kashmir, Telangana not part of India Kavita says, Part of Kashmir not of India's land Kavita says

trs mp Kavita comments on Telangana not part of India but forcibly made part of it

కవిత వ్యాఖ్యల వెనుక అంతరార్థమేమిటి?

Posted: 07/23/2014 01:45 PM IST
Kavita comments on telangana not part of india

ఉన్నట్టుండి తెలంగాణా భారత దేశంలో భాగం కాదని,భారత ఆక్రమిత ప్రాంతం అని చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కవిత వ్యాఖ్యలను అన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి, అందరు నాయకులు ఖండిస్తున్నారు బాగానే ఉంది.  కానీ ఆ మాటలకు అర్థమేమిటంటే నిజాం పాలనలో హాయిగా జీవిస్తున్నవారిని భారతదేశంలో అనవసరంగా కలిపారని!  

వ్యాఖ్యలు అంతవరకే ఉంటే ఒకలా ఉండేది.  కానీ అంతటితో ఆగలేదు.  తెలంగాణాను కాశ్మీర్ తో పోల్చి కాశ్మీర్ రాజ్యాన్ని కూడా తెలంగాణాని కలిపినట్లుగా భారత్ లో కలిపేసారనటం జరిగింది.  సరే ఏదో సాపత్యం కోసం కాశ్మీర్ పేరు ఎత్తటం జరిగిందనుకుంటే, అంతటితోనూ ఆగకుండా జమ్మూ కాశ్మీర్ లో కొంత భాగం భారత దేశానిది కాదనే సత్యాన్ని గ్రహించాలని కూడా ఆమె అనటంతో ఈ వ్యాఖ్యలన్నిటకీ వెనుకనున్న అసలు అంతరార్థమేమిటో అర్థం చేసుకోవచ్చు.  

ఒకటి, నిజాం పాలన భేష్, రెండు తెలంగాణాకు కాశ్మీర్ కి సాపత్యం, మూడు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం భారతదేశానిది కాదనటం- ఈ మూడు వ్యాఖ్యలను కలిపి చూస్తేనే కాని అసలు విషయమేమటన్నది బోధపడదు.  

తెలంగాణా రాష్ట్రంలో 16 శాతం ఉన్న ముస్లిం మైనారిటీల మద్దతును ఆశించటమే అసలు ఉద్దేశ్యం.  దానికి నాంది రంజాన్ సందర్భంలో కెసిఆర్ ప్రకటించిన 12 శాతం రిజర్వేషనైతే, దాని కొనసాగింపు ఆయన కూతురు చేసిన ఈ తాజా వ్యాఖ్యలు.  అందుకోసమే చరిత్రను మార్చటం, జరిగిన దానికి కొత్త భాష్యాలు చెప్పటం!  ఇది దేశద్రోహం కిందికి వస్తుంది!  తెరాస పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే తెలంగాణా ద్రోహులన్న తెరాస నాయకులు ఇప్పుడు దేశ ద్రోహానికి ఒడిగడుతున్న కవిత మాటలకు ఏమనరేం?  లోక్ సభకి ఎన్నికైన ఒక ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కవిత మాట్లాడాల్సిన మాటలేనా అవి?  

ఆ మాటలు ఎలాంటి సంకేతాలనిస్తున్నాయి?  ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ప్రజాప్రతినిదులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యటం ఒక తప్పైతే, రెండు దేశాల మధ్య వివాదంలో ఉన్న భూభాగం మీద పొరుగు దేశానికి అనుకూలమైన వ్యాఖ్యలను చెయ్యటం ఒక పార్లమెంట్ సభ్యురాలిగా ఎంతవరకు సమర్థనీయం?  

విద్యార్థుల స్థానికతమీద సంచలనాత్మకంగా 1956 సంవత్సరాన్ని కటాఫ్ సంవత్సరంగా తెలంగాణా ప్రభుత్వం పరిగణించటానికి రాష్ట్రమే కాదు దేశమే వేరనే భావన కూడా దోహదం చేసిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.  

తెలంగాణా వేరే దేశమా, పాకిస్తానా, అక్కడ తిరగటానికి వీసా అవసరమా అన్న వ్యాఖ్యలను లోగడ తప్పు పట్టిన తెలంగాణా నాయకులు కవిత మాటలకు మిన్నకున్నారేం?

ఇంకా ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి కవిత మాటలు.   

సీమాంధ్ర ప్రజలకు మద్దతుగా మేముంటాం, వారికి, వారి ఆస్తులకు మేము స్వయంగా భద్రత కల్పిస్తామని రాష్ట్ర విభజనకు ముందు ఎమ్ఐఎమ్ ప్రకటించటం జరిగింది.  అందువలన తెలంగాణా మనదే, మనం అసలు భారత దేశంలోనే భాగం కాము అని చెప్పి, ఆంధ్రాప్రాంతం వాళ్ళని వెళ్ళగొట్టటానికి ఎమ్ఐఎమ్ అడ్డుపడకపోవటమే కాదు సమర్థించేట్టుగా చెయ్యటం కూడా అంతర్యమేనా అన్న సందేహం కూడా రేగుతోంది.  

ఏది ఏమైనా తెలంగాణా ఎంపి కవిత మాటలు పైకి కనిపించినంత సాధారణమైన వ్యాఖ్యలు కావని, తేలిగ్గా తీసుకునేవి కావని,  దాని వెనక ఎంతో అంతరార్థముందని తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles