Staff selection commission apologises for which actress is tallest question in exam paper

SSC Kerala asks question, Staff Selection Commission apologises, which actress is tallest question in exam paper.

Staff Selection Commission or SSC, which runs an exam to make ... Apologises for 'Which Actress is Tallest' Question in Exam Paper, SSC Kerala asks question on 'tallest actress' in exam paper

ఆ ప్రశ్న ఇచ్చినందుకు క్షమించండి? ఎస్ఎస్ సీ

Posted: 07/23/2014 12:41 PM IST
Staff selection commission apologises for which actress is tallest question in exam paper

ఇటీవల జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష లో.. కొన్ని విచిత్రమైన వింత ప్రశ్నలు రావటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ పరీక్షలో వివాదాలకు తావిచ్చేలా హీరోయిన్ల ఎత్తు ఎంతంటూ ప్రశ్న అడగటం పరీక్ష రాసే ఉద్యోగార్థులను అవాక్కయ్యేలా చేసింది. బాలీవుడ్ హీరోయిన్లు కత్రీనాకైఫ్, ప్రీతీజింటా, దీపికా పదుకోనేల్లో అందరికంటే ఎవరు ఎత్తున్నారంటు ప్రశ్న ఇవ్వటం వివాదాస్పదమైంది.

ప్రశ్నపత్రంలో మహిళలను కించపరిచేలా ప్రశ్నలు ఉన్నాయంటు కేరళ మహిళా కమిషన్ ఎస్‌ఎస్‌సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నపత్రంలో రెండు ప్రశ్నలు మహిళలను అవమానించేలా ఉన్నాయని వీటిపై కమీషన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఓ ప్రశ్నలో బాలీవుడ్ హీరోయిన్లు కత్రీనా, దీపికా పదుకోనే, ప్రీతీజింటా, హుమా ఖురేషీ ల పేర్లతో నాలుగు ఆప్షన్స్ ఇస్తూ ఏ హీరోయిన్ ఎత్తుగా ఉందంటూ అడగటం, మరో రీజనింగ్‌ ప్రశ్నలో ఆల్‌ ఉమెన్‌ ఆర్ క్యాట్స్ అంటూ ప్రశ్న అడగటం వివాదానికి కారణమైంది.

అయితే ఈ విషయంపై ఎస్‌ఎస్‌సీ ఛైర్మన్ భట్టాచార్య క్షమాపణలు కోరారు. ప్రశ్నపత్రం తయారీతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, స్థానికంగా ఉండే అధ్యాపకులతో ప్రశ్నపత్రం తయారీ జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై దుమారంలేవటంతో వివాదాస్పద ప్రశ్నలను తొలిగిస్తున్నట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది.

ఆ విచిత్రమైన ప్రశ్నను తెలుసుకోవాలంటే..

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles