Hyderabad master plan for 3 times present population

Hyderabad master plan for 3 times present population, Hyderabad new master plan, Expansion program of Hyderabad,

Hyderabad master plan for 3 times present population including old city face lift

హైద్రాబాద్ లో జనాభా మూడురెట్లు పెరుగుతుందా

Posted: 07/23/2014 03:33 PM IST
Hyderabad master plan for 3 times present population

ప్రస్తుతమున్న జనాభాకి మూడు రెట్లకు సరిపోయేటట్టుగా- అంటే 30 మిలియన్ జనాభా కోసం  హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారౌతోంది అంటే జనాభా మరో మూడురెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హైద్రాబాద్ చివర్లు అనుకునే ఎల్ బి నగర్, ఉప్పల్, కాప్రా, కూకట్ పల్లి ప్రాంతాలను దాటి హైద్రాబాద్ పరివృత్తం మరింత విస్తరించేట్టుగా గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ చేస్తోంది.  అయితే మాస్టర్ ప్లాన్ ని ఏ నగరం నుంచి కాపీ చెయ్యకుండా అధ్యయనం చేసి ముఖ్యమైన, ముఖ్యంకాని ప్రాంతాలను గుర్తించి దాని మీద పనిచెయ్యటానికి కన్సల్టెంట్ల కోసం టెండర్లను పిలుస్తున్నారు.  

హైద్రాబాద్ చాలా శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న నగరం.  హైద్రాబాద్ ప్రస్తుతం విస్తరించి వున్న క్షేత్రానికి నాలుగు రెట్లు పెంచటానికి మాస్టర్ ప్లాన్ తయారు చెయ్యాలన్నది సంకల్పం.  ఆ విస్తరణ ప్లానంతా పూర్తవటానికి రెండు దశాబ్దాలు పట్టవచ్చని అంచనా.  

మాస్టర్ ప్లాన్ లో పరిశ్రమలకు, నివాసాలకు, వ్యాపార వాణిజ్యాలకు, ఇంకా ఇతర వర్గాలకు భూమిని విభజించటం జరుగుతుంది.  అందులో రోడ్లు, పార్కులు, విద్యాలయాలు, వినోదాలకు కేటాయింపులుంటాయి.  మురుగు నీరు, చెత్త డిస్పోజల్, ఆరోగ్యం, పారిశుభ్రం లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవలసివుంటుంది.  మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తూ భవన నిర్మాణ నియమాలను కచ్చితంగా అమలుపరచినట్లయితే నగరం ఆ బ్లూ ప్రింట్ ప్రకారం రూపుదిద్దుకుంటుంది.  

పాత నగరానికీ కొత్త సొబగులు

హైద్రాబాద్ పాతనగరం కూడా కొత్త అందాలు సంతరించుకునేట్లుగా కెసిఆర్ ప్రభుత్వం యోజనలు చేస్తోంది.  అందులో భాగంగా రోడ్డు విస్తరణ పనులు, పాత ప్రాజెక్ట్ లను పునరుద్ధరించే పనులు, భూకబ్జాలను తొలగించటం, ఇంకా ఇమ్లీ బన్ లాంటి బస్ టెర్మినల్స్ ని మరో ఐదిటిని నిర్మించటం కూడా ప్రణాళికలో ఉంది.  పాత బస్తీ ఏ విషయంలోనూ కొత్త నగరం మీద ఆధారపడగూడదన్నది- అది విద్యా విషయంలోనే కావొచ్చు, వినోదం కోసమే కావొచ్చు, వైద్యం కోసమే కావొచ్చు కానీ పాత బస్తీ స్వయం సమృద్ధిగా ఉండాలన్నది ఉద్దేశ్యం.  

అయితే పాత బస్తీని అభివృద్ధి చేస్తూనే చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలన్నది కూడా ప్రణాళికలో ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles