N kiran sensational comments

kiran kumar reddy, n kiran kumar reddy, samaikyavadi, Seemandhra Student JAC, N Kiran sensational comments, congress party, ap bifurcation, sonia gandhi, telangana issue, telangana bill, ex cm kiran kumar reddy new party, seemandhra districts, 2014 election.

N Kiran sensational comments, Ex CM Kiran meet with Seemandhra student JAC, Kiran Kumar speech at Seemandhra Student JAC meet

నగరంలో సమైక్యవాది నల్లారి వారి కామెంట్స్

Posted: 02/26/2014 06:07 PM IST
N kiran sensational comments

మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి సారి  సమైక్యంద్ర జేఏసీ విద్యార్థులతో  సమావేశం అయ్యారు.   ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు  సమైక్యంద్ర కోసం  పోరాటం చేసిన  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  సీమాంద్రకు చెందిన  13 జిల్లాల విద్యార్థులతో సమావేశం అయ్యారు. 

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  సభలో మాట్లాడుతూ.. ఇప్పుడు  విద్యార్థుల సత్తా చాటే  సమయం వచ్చిందని  ఆయన సీమాంద్ర విద్యార్థులనుద్దేశించి  అన్నారు. ముఖ్యమంత్రి పదవి  రాజీనామ చేసిన అనంతరం రాజకీయ నేతలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  కొత్త పార్టీ   పెడుతున్న తురుణంలో  విద్యార్థి సంఘాలతో  సమావేశం  కావటం  అందర్ని  ఆశ్చర్యపరుస్తుంది.  

ఈ సమావేశంలో.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  దొడ్డిదారిన  రాష్ట్ర విభజన  చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.  ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు  తెలుగు వారిని  అవమనించారని  కిరణ్ కుమార్  రెడ్డి ఆవేశంగా అన్నారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలను అడ్డంపెట్టుకునే కేంద్రం రాష్ట్ర విభజన చేసిందని ఆయన ఆరోపించారు. కేసుల నుండి తప్పించుకోవడానికి ఒకరు, పదవుల కోసం మరొకరు గడ్డి తిన్నారని కిరణ్ ఘాటుగా విమర్శించారు.

తెలుగువారిని అవమానిస్తే మౌనంగా ఉండాలా? మన రాజధానిని తీసుకుని వెళ్ళిపొమ్మంటే పోవాలా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్రలు సంక్రాంతికి వెళితే... హైదరాబాద్ ఎడారిలా మారిందని... విభజన అనంతరం అదే పరిస్థితి ఉంటుందని కిరణ్ జోష్యం చెప్పారు.

అసలు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశా? తెలంగాణనా? అని ప్రశ్నించారు. అందరూ కలిసి ఉన్న రాజధానిని మన నుంచి లాక్కొని, మనల్ని మెడ పెట్టి గెంటేసి తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ప్రకటించుకున్నారని ఆయన తీవ్ర స్ధాయిలో విమర్శించారు.

తెలుగు వారిని పార్లమెంటులో అవమానిస్తుంటే ఊరుకోవాలా? అని కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానంటే , కొన్ని పత్రికలు సోనియాగాంధీనే నా చేత పార్టీ పెట్టిస్తున్నారని దుష్ప్రచారం చేశాయని కిరణ్ పేర్కొన్నారు. 

-ఆర్ఎస్

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles