Isro plans to send human beings to space

ISRO plans to send human beings to space, Indian Space Research oganization, ISRO Chairman Radha Krishnan

ISRO plans to send human beings to space

స్పేస్ లోకి మనుషులను పంపబోతున్న ఇస్రో

Posted: 02/26/2014 04:58 PM IST
Isro plans to send human beings to space

ఇదమిద్ధంగా ఎటువంటి ప్రణాళికా లేకపోయినా మనుషులను రోదసీ లోకి తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా తీసుకుని రావటానికి భారత్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మంగళూర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆ కార్యక్రమం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భూమికి 275 నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉంచి వారం రోజుల తర్వాత తిరిగి భూమి మీదకు తీసుకుని రావటానికి 2006-2007 లోనే పరిశీలన జరిగిందని అన్నారు. 

ల్యాబ్ లో దీని మీద పరీక్షలు జరిగాయి కానీ నిజంగా స్పేస్ లోకి పంపించవలసివుంది.  వాతావరణాన్ని నియంత్రిస్తూ ప్రాణ రక్షణకు అవసరమైనవాటి మీద అధ్యయనం చేస్తున్నామన్నారు రాధాకృష్ణన్. 

ఈ పరీక్షకోసం ఏ వాహనాన్ని వాడతారని అడిగిన దానికి రాధాకృష్ణన్, పిఎస్ఎల్ సి ఒక మనిషిని, జిఎస్ఎల్ వి ఇద్దరిని, జిఎస్ఎల్ వి ఎమ్కే 3 ముగ్గురిని తీసుకెళ్ళగలుగుతుందని అన్నారు.

దీని మీద ఇంకా అధ్యయనం జరుగుతోందని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles