6 special trains from andhra for dharna at delhi

6 special trains from Andhra for dharna at Delhi, APNGO chalo Dlehi program, Seemandhra protesters special trains, Dharna at Delhi for Samaikyandhra

6 special trains from Andhra for dharna at Delhi

ఢిల్లీలో ధర్నాకు ఆంధ్రా నుంచి 6 ప్రత్యేక రైళ్ళు

Posted: 02/15/2014 03:09 PM IST
6 special trains from andhra for dharna at delhi

రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టటాన్ని నిరసిస్తూ ఏపిఎన్జీవోలు ఢిల్లీ బయలుదేరారు. 

ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో రూపొందించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో తిరుపతి నుంచి ప్రత్యేక రైలు 1.30 కి బయలుదేరింది.  మధ్యాహ్నం 2.00 కి కాకినాడ నుంచి మరో రైలు బయలుదేరింది.  4.00 గంటలకు నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి 6 గంటలకు విజయవాడ నుంచి 8 గంటలకు ప్రత్యేక రైళ్ళు బయలుదేరనున్నాయి.

ఢిల్లీలో సీమాంధ్రుల ధర్నాకోసం ప్రత్యేక రైళ్ళకు అనుమతించటం సరికాదన తెరాస నాయకుడు వినోద్ మీడియా ముందు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, సీమాంధ్రులు ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే దాని ప్రభావం ఇరు ప్రాంతాలలోనూ ఉంటుందని అందువల కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ ధర్నాను అనుమతినివ్వరాదని అన్నారు.

భాజపాలో చేరిన నాగం జనార్దన రెడ్డి కూడా సీమాంధ్రులు ప్రత్యేక రైళ్ళల్లో వచ్చి ఢిల్లీలో భయాందోళనలను సృష్టిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారాయన. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles