Service tax on ttd stayed

service tax on TTD stayed, Tirumal Tirupati Devasthanams, Supreme court stays service tax on TTD, Petition against seervice tax on TTD, service to God

service tax on TTD stayed, Tirumal Tirupati Devasthanams

సర్వీస్ టాక్స్ దేవాదాయాల మీద కూడానా?

Posted: 02/15/2014 02:10 PM IST
Service tax on ttd stayed

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఉండటానికి ఏర్పాటు చేసిన విడిదులు, ఇతర సేవల మీద ప్రభుత్వం ఆశిస్తున్న సర్వీస్ టాక్స్ ల మీద సాధికారతను సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.  ఫైనాన్స యాక్ట్ లోని సెక్షన్ 65 (105), 66 బి ల ప్రకారం సర్వీస్ టాక్స్ కట్టమని అడుగుతున్న దానిమీద తితిదే సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. 

తితిదే వ్యాపార వాణిజ్యాలు చెయ్యటం లేదని, స్వచ్ఛంద సేవా సంస్థ చట్టానికి లోబడే కార్యక్రమాలు జరుగుతున్నాయని పిటిషన్ లో తెలియజేయటం జరిగింది.  భక్తులు చెల్లించే అద్దెలు, ఇతర ఫీజులను సందర్శకుల సదుపాయాలకు ఉపయోగిస్తున్నామని అందువలన అందులో సర్వీస్ టాక్స్ ని ఆకర్షించే అంశమేమీ లేదని తితిదే వాదన. 

తితిదే తరఫున వాదించిన మాజీ అటర్నీ జనరల్ కె.పరాశరన్ మతం అనేది ప్రాధమిక హక్కని, కేంద్ర ప్రభుత్వం టాక్స్ ని డిమాండ్ చెయ్యటం ద్వారా దాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు.  రాజ్యాంగంలో అర్టికిల్ 26, 27, 14 లను ఉల్లంఘిస్తున్న ఫైనాన్స్ యాక్ట్ లోని సర్వస్ టాక్స్ ని తితిదే నుంచి వసూలు చెయ్యటానికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలో మధ్యంతర స్టే ఇవ్వాలని నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. 

జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఇబ్రహీం ఖలీఫుల్లాల ధర్మాసనం 6 కోట్ల రూపాయలను తితిదే నుండి డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని బలవంతంగా వసూలు చెయ్యవద్దని నిలువరిస్తూ ఆదేశాలనిచ్చింది. 

ఎక్కడ సర్వీస్ లేక సేవ అనే పేరున్నా టాక్స్ వేసేస్తామంటే ఎలా?  'భగవంతుడి సేవలో' అంటారు.  ఇంగ్లీష్ లో కూడా 'సర్వీస్ టు గాడ్' అంటారు.  మరి దాని మీద కూడా టాక్స్ వేస్తానంటే?  వైష్ణవులు చేసేదాన్ని భగవంతుడికి చేసే సేవ అంటారు.  ఉత్సవాలన్నిటినీ సేవలనే అంటారు.  'అయితే మామీద కూడా టాక్స్ వెయ్యండి మాదీ భగవత్సేవే' అన్నాడో భక్తుడు వాహనాన్ని మోస్తూ రథాన్ని లాగుతూ. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles