ధ్యానం అంటే ఏమిటన్నదానిమీద ఎన్నో భాష్యాలు వినిపిస్తాయి కానీ ధ్యానం అన్న పదానికి అర్థం మాత్రం ఒకటే. పరుగులు పెట్టే మానసాన్ని ఒకే వస్తువు లేక విషయం మీద నిలపటం అని. అలా నిలపటానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలనే ధ్యానం గా వ్యవహరిస్తున్నారు చాలామంది. ధ్యాన లక్ష్యాన్ని ధ్యానంగా చెప్తారు మరి కొందరు. అంటే పర్యవసానాన్ని. ధ్యానం వలన మనసు పూర్తిగా లయమైపోతుంది కాబట్టి ధ్యానం అంటే ఏమీ చెయ్యకుండా ఉండటం అని చెప్తారు. అప్పుడు, ఏమీ చెయ్యకుండా ఉండటానికి ఇక చేసేదేముంటుంది కాబట్టి ధ్యానం చెయ్యటం అని అనగూడదని చెప్తారు.
ఇలా భాషలో తర్జన భర్జనలతో ధ్యానం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళల్లో సందేహాలను ఇంకా లేపిన వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి సందేహాలు, ధ్యానం అంటే అది కాదు ఇది కాదు అని కాకుండా దాని మీద ఎలా పట్టుసాధించాలన్నది తెలుసుకుని సొంతం చేసుకోవటమే చెయ్యవలసింది.
ధ్యాన సాధన వలన జరిగే పర్యవసానంతో వెనక్కి వచ్చి దాన్ని అర్థం చేసుకుందాం.
ధ్యానంతో చిత్త వృత్తులు నిరోదించబడతాయి అని చెప్పటం జరిగింది. అంటే మనసులో వాటంతట అవే చెలరేగే ఆలోచనా స్రవంతికి అడ్డుకట్ట పడుతుంది. మనం ఆలోచించి ఒక నిర్ణయానికి రావటానికి మనసు ఉపయోగపడుతుంది. కానీ ఆ మనసే తనంతట తానే ఆలోచించటమంటే, కంప్యూటర్ ఆన్ చెయ్యగానే ఆ కంప్యూటరే తనకిష్టమైన ప్రోగ్రాంని రన్ చేసినట్లవుతుంది. మనకు కావలసిన అప్లికేషన్ ని మనం ఉపయోగించాలి కాని మనలను కంప్యూటర్ నడిపించగూడదు కదా.
అలాగే మనకు సేవ చెయ్యటానికి ఉన్న సేవకులు వాళ్ళిష్టమైన పని వాళ్ళు చెయ్యటమే కాకుండా మనలను కూడా ఆ పనులు చెయ్యమని ప్రలోభపెడుతుంటే ఎవరికోసం ఎవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని చివరకు మర్చిపోవటం జరుగుతుంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళకి ఏ పని చెప్తే వాళ్ళకు ఆనందం కలుగుతుందో చెప్పమని అడుగుతామా. కానీ మనకోసం ఉన్న డెసిషన్ బాక్స్ అయిన మనసుని రంజింప జేయాలని చూస్తాం. ఏం చేస్తే మనసుకి ఆనందం కలుగుతుందా అని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం.
మనసు విషయంలో మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. పని చెయ్యటానికున్న కాళ్ళు, చేతులు లాంటి పంచ కర్మేంద్రియాలను మనకు అవసరమైనప్పుడు కదిలిస్తాం. కళ్ళకు కనపడటం, చెవులకు వినపడటం, చర్మాన్ని స్పర్శ తెలియటం లాంటి పంచ జ్ఞానేంద్రియాలు మనం చెప్పకపోయినా పనిచేస్తుంటాయి. అవి మనకున్న సెన్సార్స్. వీటన్నిటినీ నియంత్రించే మనసు అవసరమైనవాటిని గుర్తు పెట్టుకోవటం (సేవ్ చెయ్యటం) తిరిగి ఉపయోగించాల్సిన అవసరం పడ్డప్పుడు మనకు గుర్తు చెయ్యటం (డేటా రిట్రీవింగ్) చేస్తుంది. దాన్ని మనం ప్రత్యేకంగా ఆ పనులకు పురమాయించాల్సిన పని లేదు. అందువలన దాని మీద మన నియంత్రణ తగ్గిపోయింది. దానితో నిరంతరం, అవసరం లేని సమయంలో కూడా మనసు పనిచెస్తూనే వుంటుంది. మనం ఉన్న వాతావరణంలో సెన్సార్సయిన పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించే డేటాకు అనుగుణమైన పూర్వ కాలంలోని డేటా ను కూడా కలిపి క్రోడీకరణ చేసి మనకు అందిస్తుంటుంది మన మనసు.
ఉదాహరణకు ఒక మనిషిని చూడగానే మనసులో నిక్షిప్తమైన ఇమేజ్ లతో కనిపిస్తున్న మనిషి ఇమేజ్ ని మ్యాచ్ చేసి ఆయన ఫలానా మనిషి అంటే, ఆయన పేరు, ఉన్నంత మేరకు ఆయన బయోడేటాతో పాటు ఆయనకూ మీకూ ఉన్న సంబంధం, మీ ఉద్దేశ్యంలో ఆయన గుణగణాలు, ప్రస్తుతం మీకు ఆయన అవసరం ఉందా లేదా, ఆయనను ఏ స్థాయిలో ఏ హోదాలో చూడాలి అన్నవాటిని అన్నిటినీ బయటకు తీసి మీకు అందిస్తుంది. ఇది దాని పని.
అయితే మన పనేమిటి? దాన్ని ఉపయోగించుకుని ఆ ఎదుట బడ్డ మనిషితో ఎలా వ్యవహరించాలన్నది నిర్ణయించుకోవటం. మళ్ళీ, ఈ నిర్ణయాన్ని కూడా మనసు గుర్తుపెట్టుకుని మరోసారి కనిపించినప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. కానీ చూసినవన్నీ విన్నవన్నీ మనకు అవసరమయ్యేవేమీ కాదు. అలాంటప్పుడు వాటిని మనం పట్టించుకోనక్కర్లేదు. కానీ మనసు మాత్రం నిరంతరం పనిచేస్తునేవుంటుంది. జ్ఞానేంద్రియాలు అందించే విషయాలను విశ్లేషిస్తూనే ఉంటుంది. మనం విశ్రాంతిగా ఉన్న సమయంలో కూడా మనసు మాత్రం నిర్విరామంగా పనిచేస్తుంటుంది. అది పని చేస్తే కాస్త శక్తిని ఉపయోగిస్తుంటుంది కాని అది కాదు అసలు నష్టం. మనం అలవాటు ప్రకారం ఆ మనసుని అనుసరిస్తూ మనకు విశ్రాంతి లేకుండా చేసుకుంటున్నాం.
అందువలన మనకు విశ్రాంతి లభించాలంటే అది పనిచెయ్యటమన్నా ఆగిపోవాలి, లేదా మనం పట్టించుకోవటమన్నా మానెయ్యాలి. ఈ రెండూ సాధ్యం కాకపోవటం వలన విశ్రాంతికోసం సంగీతాన్ని వినటం కానీ లేదా ఏదైనా కార్యంలో నిమగ్నమవటం కానీ చేస్తుంటారు. అప్పటికీ మనసు పక్కదార్లకు మళ్ళిస్తుంటుంది. అదిగో అక్కడే మనవాళ్ళు వ్యసనాలకు బానిసలవుతుంటారు. మెదడు మొద్దుబారి జ్ఞానేంద్రియాలనుంచి వచ్చే సంకేతాలను పూర్తిగా పట్టించుకోకపోవటం, క్రోడీకరించే మనసుకి అందించకపోవటం చేస్తుంది. అందువలన ఆ విధంగా విశ్రాంతి పొందటానికి అలవాటు పడుతుంటారు కొందరు.
కానీ అటువంటివేమీ లేకుండానే మత్తు పదార్థాల అవసరం పడకుండానే ధ్యాన ప్రక్రియలో సంపూర్ణమైన విశ్రాంతిని పొందవచ్చు. ఇదే ధ్యాన పర్యవసానం. ఇదే దాని లక్ష్యం.
ఒక దాని మీద మనసుని నిలపగలిగితే కాసేపటి ఆ రెండూ ఏకమై పోయి శూన్యం ఏర్పడుతుంది. అంటే ధ్యాత- ధ్యానం చేసే వాడు, ధ్యేయం- ధ్యానించబడేది కలిసిపోతాయి. అందుకే ధ్యానంలో అటువంటి సంపూర్ణమైన విశ్రాంతి లభిస్తుంది. దాన్ని ధ్యానంలో నిమగ్నమవటం, సమాధి స్థితి, బ్రాహ్మీ స్థితి, ఆనంద స్తితి, తాదాత్మ్యత అనే పదాలతో ఆ స్థితిని భాషాపరిధిలో వివరించే ప్రయత్నాలు చేసారు.
ఇక ఆ ధ్యాన స్థితిని పొందటానికి చేసే ప్రక్రియలు చాలా ఉన్నాయి. వాటిలో మనకు అనుకూలంగా ఉన్న పద్ధతిని అనుసరించవచ్చు. కాబట్టి ధ్యానం అంటే ఇదే అని ఆ పద్ధతులకు కాకుండా చేసే పనులకు ప్రాధాన్యత నివ్వాలి. నడిచి వెళ్ళినా, బండి మీద వెళ్ళినా మనం వెళ్ళిన చోటు అక్కడ చేసే పని ముఖ్యం కాబట్టి మనకు వీలైన అనుకూలమైన మనకు ఉపయోగించే అర్హత ఉన్న ప్రయాణసాధనాన్ని ఉపయోగించినట్లే మనకు అందుబాటులో ఉన్న విధానాన్ని అనుసరించి ధ్యానస్థితిని పొంది ఏ మత్తు పదార్థాలూ ఇవ్వలేని సంపూర్ణమైన విశ్రాంతిని పొందటమే కాకుండా ఏ సమయంలో నైనా అందులోంచి బయటకు రావొచ్చు. హాంగోవర్లేమీ ఉండవు. ఖర్చు లేని పని. ఏ సమయంలోనైనా చెయ్యగలిగిన పని.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more