Telugu desam errabelli dayakar rao fire on kadiyam srihari

errabelli dayakar rao, kadiyam srihari, telugu-desam, srihari issue, errabelli dayakar rao on kadiyam srihari, tdp, baswareddy, e peddireddy, chandra babu naidu, trs

errabelli dayakar rao fire on kadiyam srihari

పోతే పొండి...విమర్శలొద్దు

Posted: 05/12/2013 10:34 AM IST
Telugu desam errabelli dayakar rao fire on kadiyam srihari

కడియం శ్రీహరి పార్టీ వీడిన అనంతరం ఆ అంశంపై పార్టీ నేతలు స్పందించారు. వివిధ కారణాలతో పార్టీని వీడుతున్న నేతలు పార్టీపైనా, అధినేతపైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని దేశం నేతలు సలహానిచ్చారు.విపక్ష నేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌ రావు, బస్వారెడ్డి, ఇ. పెద్దిరెడ్డి  మాట్లాడారు. పార్టీ ద్వారా ఎంత లబ్ధి పొందవచ్చో కడియం అంత పొందారన్నారు. ఆయన కన్నా సీనియర్లను కాదని శ్రీహరికి పార్టీ ప్రాధాన్యమిచ్చిందన్నారు. నేతల్లో స్వార్థం పెచ్చరిల్లడంతోనే వలసబాట పడుతున్నారని చెప్పారు. నేతలు పోయినా కేడర్‌ చెక్కుచెదరదని స్పష్టం చేశారు.

రేపు నాలాంటి వారు వెళ్లిపోయినా వెంట ఎవరూ రారని ఎర్రబెల్లి వాఖ్యానించారు.  వివిధ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను నియమించకపోవడం వెనక తనతో పాటు శ్రీహరికీ బాధ్యత ఉందన్నారు. పార్టీకి ఎవరు దూరమైనా వారే నష్టపోతారు. తెలంగాణ సాధన కోసమైతే టీఆర్‌ఎస్‌లో చేరరని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. దేశంలో కేసీఆర్‌ను అందరికన్నా ఎక్కువగా విమర్శించిన శ్రీహరి ఆయన పార్టీలో చేరడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. గతంలో జగన్‌ను రక్షించేందుకు బ్లాక్‌మెయిలింగ్‌ తరహాలో అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపై పెట్టారు. జగన్‌ కోసం పెట్టిన తీర్మానం కాబట్టే తమ పార్టీ అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles